Varun Chakravarthy : దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఆకట్టుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ ను కూల దోశాడు. టీమిండియా ఆ సిరీస్ గెలవడంలో వరుణ్ చక్రవర్తి కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లోనూ వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ చేయడంతో టీమిండియా కోచ్ గౌతం గంభీర్ ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు లభించినప్పటికీ వరుణ్ చక్రవర్తికి మొదటి రెండు మ్యాచ్లలో ఆడే అవకాశం లభించలేదు. దీంతో అతడు రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా తో సెమీఫైనల్, న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్లో అతడు అదరగొట్టాడు. అంతేకాదు ఆడిన 3 మ్యాచ్లలో ఏకంగా 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వరుణ్ చక్రవర్తి టీమిండియాలో మోస్ట్ వాంటెడ్ బౌలర్ గా అవతరించాడు. ప్రస్తుతం టీమిండియా ఆడే తదుపరి మ్యాచ్లలో అతడికి కచ్చితంగా చోటు లభిస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ప్రతిభ చూపిన తర్వాత వరుణ్ చక్రవర్తి తన మనసులోని మాటలను బయటపెట్టాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Also Read : నెంబర్ వన్ గా టీమిండియా.. టాప్ – 3 లో గిల్, రోహిత్!
రోహిత్ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడిన వరుణ్ చక్రవర్తి.. కీలక వ్యాఖ్యలు చేశాడు..” ఐపీఎల్, టి20 ఫార్మాట్, వన్డే ఫార్మాట్ లో మ్యాచులు ఆడాను. కెప్టెన్లతో సావాసం చేశాను. కానీ నన్ను నన్నుగా చూసింది మాత్రం రోహిత్ శర్మనే. రోహిత్ శర్మ నన్ను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. పవర్ ప్లే లో రెండు ఓవర్లు, చివర్లో 2, 3 ఓవర్లు, మిడిల్ ఓవర్లలో జట్టుకు వికెట్ కావలసినప్పుడు బౌలింగ్ చేస్తాను. అది నా బలం అని రోహిత్ శర్మతో వ్యాఖ్యానించాను. నేను చెప్పింది ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత నాకు అవకాశం ఇచ్చాడు. నన్ను రోహిత్ పూర్తిగా నమ్మాడు. నన్ను నన్నుగా చేశాడు. అందువల్లే ఛాంపియన్స్ ట్రోఫీలో నా దగ్గర నుంచి అలాంటి గణాంకాలు వచ్చాయి. ఇకపై కూడా వస్తాయి. నేను చూసిన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకడు. అతడు జట్టును అద్భుతంగా నడిపిస్తాడు. ఉన్న ప్లేయర్లతో అద్భుతమైన ఫలితాలను సాధిస్తాడు. అందుకు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవడమే ఒక బలమైన ఉదాహరణ. 2017లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయింది. కానీ ప్రస్తుత టోర్నీలో విజేతగా నిలిచింది. దీనినిబట్టి రోహిత్ నాయకత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని” వరుణ్ వ్యాఖ్యానించాడు.
Also Read : విరాట్ కోహ్లీని అధిగమించిన హార్దిక్ పాండ్యా.. వామ్మో ఈ క్రేజ్ ఏందయ్యా బాబూ..