Dilruba Movie : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఈయన గత చిత్రం ‘క’ కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాకు ముందు ఆయనకు వరుసగా రెండు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ‘క'(Ka Movie) చిత్రం తో భారీగా కం బ్యాక్ ఇవ్వడంతో ఇక కిరణ్ అబ్బవరం జాతకం మారిపోయింది, సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు అని అందరూ అనుకున్నారు. ఆయన తదుపరి చిత్రానికి మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ ఉంటాయని ఆశించారు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘దిల్ రూబా'(Dilruba Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. విడుదల తర్వాత కూడా అదే పరిస్థితి. సినిమాకు సరిగా టాక్ కూడా బయటకు రాలేదు.
Also Read : దిల్ రూబా ట్విట్టర్ టాక్: కిరణ్ అబ్బవరం మూవీకి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్, ఇంతకీ హిట్టా ఫట్టా?
దీంతో ఆడియన్స్ కి ఈ సినిమా బాగుందా లేదా అనేది అర్థం కావడం లేదు. కానీ ఓపెనింగ్స్ చూస్తుంటే ఈ సినిమాకి పబ్లిక్ లో టాక్ లేదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. మరో పక్క ఈ సినిమాతో పాటు విడుదలైన ‘కోర్ట్’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. గంటకు 7 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి, ఫస్ట్ షోస్ నుండి పది వేల టిక్కెట్లు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ‘దిల్ రూబా’ చిత్రానికి గత 24 గంటలకు కలిపి కేవలం పది వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే ఓపెనింగ్ వసూళ్లు కనీసం కోటి రూపాయిల షేర్ అయినా వస్తుందా లేదా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఒకవేళ కోటి రూపాయిలు రాకపోతే కిరణ్ అబ్బవరం కి ఫ్లాప్ తప్పదు అనొచ్చు. ‘కోర్ట్’ విడుదలైన రోజే ఈ సినిమా కూడా విడుదల అవ్వడం పెద్ద మైనస్ అయ్యింది అని అనుకోవచ్చు.
ఆడియన్స్ మొత్తం కోర్ట్ సినిమాకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ, ‘దిల్ రూబా’ అనే చిత్రం విడుదల అయ్యింది అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. కిరణ్ అబ్బవరం మాత్రం విడుదలకు ముందు ప్రొమోషన్స్ ఒక రేంజ్ లో చేసాడు. సోషల్ మీడియా లో ఆయన ఒక టీం ని ఏర్పాటు చేసి డబ్బులిచ్చి మరీ స్పెషల్ క్యాంపైన్స్ రన్ చేస్తున్నాడు.అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. కొన్ని ట్వీట్స్ సోషల్ మీడియా లో పాజిటివ్ గా పడుతున్నాయి కానీ, అవి నిజమా?, లేకపోతే పైడ్ అనేది అర్థం చేసుకోలేకున్నారు ఆడియన్స్. అందుకే బుక్ మై షో లో అంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
Also Read : ప్రీమియర్ షోస్ నుండి ‘కోర్ట్’ మూవీ ఇంత గ్రాస్ వసూళ్లు వచ్చాయా..నాని బ్రాండ్ ఇమేజ్ పవర్ మామూలుగా లేదుగా!