https://oktelugu.com/

Mahesh-Rajamouli Movie : మహేష్, రాజమౌళి సినిమా కోసం ముంబైలో ఆస్తులను అమ్ముతున్న ప్రియాంక చోప్రా..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

Mahesh-Rajamouli movie : బాలీవుడ్ లో సూపర్ స్టేటస్ ఉన్న ఈమె, హాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా మంచి గుర్తింపుని దక్కించుకొని గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి లాస్ ఏంజిల్స్ లో స్థిరపడింది.

Written By:
  • Vicky
  • , Updated On : March 14, 2025 / 08:18 PM IST
    Priyanka Chopra

    Priyanka Chopra

    Follow us on

    Mahesh-Rajamouli Movie :  బాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ ఉన్నటువంటి హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) పేరు కచ్చితంగా ఉంటుంది. 2002 వ సంవత్సరం లో తమిళ హీరో విజయ్ నటించిన ‘తమీజన్'(Tamizhan) అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ప్రియాంక, ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అక్కడ వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్న సమయంలోనే ఈమె విలన్ రోల్స్ వంటివి కూడా చేసి అవార్డులను కూడా అందుకుంది. బాలీవుడ్ లో సూపర్ స్టేటస్ ఉన్న ఈమె, హాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా మంచి గుర్తింపుని దక్కించుకొని గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి లాస్ ఏంజిల్స్ లో స్థిరపడింది.

    Also Read : మహేష్-రాజమౌళి మూవీ ‘కంగువ’ చిత్రానికి కాపీ గా రాబోతోందా..? స్టోరీ మొత్తం లీక్ అయిపోయిందిగా!

    ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఆమె ఇండియన్ సినిమాలో నటిస్తుంది. అది కూడా మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా ద్వారా అవ్వడం విశేషం. లాస్ ఏంజిల్స్ లో స్థిరపడిన తర్వాత ప్రియాంక చోప్రా ముంబై లో ఉన్న తన ముఖ్యమైన ఆస్తులను అమ్మేసింది. ఆ తర్వాత ఆమె లాస్ ఏంజిల్స్ లో సొంత ఇల్లు ని కొనుగోలు చేసింది. గోవా లో కూడా ఈమెకు ఒక సొంత ఇల్లు ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనేందుకు ఆమె సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ఆమె రాజమౌళి, మహేష్ సినిమాలో నటిస్తున్నందున రెండు నుండి మూడేళ్ళ పాటు హైదరాబాద్ లోనే ఉండాల్సిన పరిస్థితి రావొచ్చు. ఇతర దేశాల్లో ఎక్కువ శాతం షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ., అధిక శాతం షూటింగ్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉంటుంది.

    అందుకోసమే ఆమె హైదరాబాద్ లో ఒక అందమైన ఇల్లుని కొనుగోలు చేయబోతుందని టాక్. కేవలం ఈ సినిమా కోసం మాత్రమే కాదు, చాలా కాలం నుండి ఆమె హైదరాబాద్ లో ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తుందట. కానీ ఇప్పుడు సరైన సమయం రావడంతో వెంటనే కొనుగోలు చేయడానికి పూనుకుంది. ఇకపోతే మహేష్, రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా విలన్ రోల్ లో కనిపించబోతుంది టాక్. ప్రియాంక చోప్రా కి విలన్ రోల్స్ వేయడం కొత్తేమి కాదు. గతంలో ఆమె ‘Aitraaz’, ‘బే వాచ్’, ‘7 కూఫ్ మాఫ్’ ఇలా ఎన్నో సినిమాల్లో నెగటివ్ రోల్స్ తో మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఆమె ఆ రోల్ లో మన ఇండియన్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఒడిశా ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా జరుగుతుంది. ఆ తర్వాత ఆఫ్రికా లో కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

    అందుకోసమే ఆమె హైదరాబాద్ లో ఒక అందమైన ఇల్లుని కొనుగోలు చేయబోతుందని టాక్. కేవలం ఈ సినిమా కోసం మాత్రమే కాదు, చాలా కాలం నుండి ఆమె హైదరాబాద్ లో ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తుందట. కానీ ఇప్పుడు సరైన సమయం రావడంతో వెంటనే కొనుగోలు చేయడానికి పూనుకుంది. ఇకపోతే మహేష్, రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా విలన్ రోల్ లో కనిపించబోతుంది టాక్. ప్రియాంక చోప్రా కి విలన్ రోల్స్ వేయడం కొత్తేమి కాదు. గతంలో ఆమె ‘Aitraaz’, ‘బే వాచ్’, ‘7 కూఫ్ మాఫ్’ ఇలా ఎన్నో సినిమాల్లో నెగటివ్ రోల్స్ తో మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఆమె ఆ రోల్ లో మన ఇండియన్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఒడిశా ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా జరుగుతుంది. ఆ తర్వాత ఆఫ్రికా లో కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు

    Also Read : నిరాశపర్చిన కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ ఓపెనింగ్స్..మొదటిరోజు గ్రాస్ ఇంత దారుణంగా ఉందా!