Varun Chakaravarthy: టెస్ట్ క్రికెట్లో, వన్డే క్రికెట్లో 5 వికెట్ల ప్రదర్శన సర్వసాధారణమే. టి20 క్రికెట్లో అది అప్పుడప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మేటి బౌలర్లు మాత్రమే ఈ రికార్డును సాధించగలుగుతారు. కానీ అపారమైన అనుభవం లేకపోయినప్పటికీ.. ఇప్పుడిప్పుడే టి20 క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. వరుణ్ చక్రవర్తి ఆ రికార్డులను అ సృష్టిస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో టీమిండియా తరఫున వరుణ్ చక్రవర్తి అయిదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అయితే ఆ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఇక మంగళవారం నాడు రాజ్ కోట్ లో జరిగిన టి20 మ్యాచ్లో వారం చక్రవర్తి అయిదు వికెట్ల పడగొట్టాడు.. అయితే ఈ మ్యాచ్ లోనూ టీమిండియా ఓటమి పాలు కావడం విశేషం. రెండు మ్యాచ్లలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి.. వరుణ్ చక్రవర్తి ఆకట్టుకున్నప్పటికీ.. టీమిండియా ఓడిపోవడంతో అతని ప్రతిభ ఆశించినత స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేదు.
నాలుగు ఓవర్లు వేసి..
వరుణ్ చక్రవర్తి రాజ్ కోట్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో.. నాలుగు ఓవర్లు వేసి.. 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు.. ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. జోస్ బట్లర్(24), స్మిత్(6), ఓవర్ టన్(0), కార్సే(3), ఆర్చర్ (0) వికెట్లను వరుణ్ చక్రవర్తి పడగొట్టాడు. షమీలాంటి సీనియర్ బౌలర్ తేలిపోయిన చోట.. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ వంటి బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినచోట.. వరుణ్ చక్రవర్తి వైవిధ్యం బౌలింగ్ వేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.. అయితే ఇంత బౌలర్లు ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. బట్లర్(24), డకెట్(51), లివింగ్ స్టోన్(43) పరుగులు చేయడంతో ఇంగ్లాండు జట్టు..9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి మాదిరిగా మిగతా బౌలర్లు బౌలింగ్ చేసి ఉంటే.. మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. వరుణ్ చక్రవర్తి మైదానంపై ఉన్న మంచును సద్వినియోగం చేసుకున్నాడు. బంతితో స్పిన్ సరిగ్గా రాబడుతూ వికెట్లను పడగొట్టాడు. అయితే మిగతా బౌలర్లు ఆ స్థాయిలో పేస్, స్పిన్ రాబట్టడంలో విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్లలో భారీ స్కోర్ చేయగలిగింది. ముఖ్యంగా లివింగ్ స్టోన్ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. లివింగ్ స్టోన్ చేసిన 43 పరుగుల్లో ఐదు సిక్సర్లు ఉన్నాయంటే.. భారత బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసిన నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 మ్యాచ్ లోనూ వరుణ్ చక్రవర్తి ఇదే స్థాయిలో మాయాజాలాన్ని ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.