War 2 : హృతిక్ రోషన్ వార్ 2 సినిమా కోసం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా తెగ వెయిట్ చేస్తుంది. ఇక ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే వీరిద్దరి ఫేస్ టూ ఫేస్ సన్నివేశం కోసం మేకర్స్ భారీ సన్నాహాలు చేశారని సమాచారం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటు ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు నాటు పాటతో గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేశారు. ఇక మ్యూజిక్ పరంగానూ ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది ఈ పాట. ఈ సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చింది. అయితే ఈ పాటలో ఇద్దరు హీరోలు పర్ఫెక్ట్ సింక్‌లో చేసిన డ్యాన్స్, గ్లోబల్ ఆడియన్స్‌ను ఫుల్ గా అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఇదే రిపీట్ చేయాలి అని చూస్తున్నారట నార్త్ మేకర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న వార్ 2 మీద ఉన్న అంచనాలు ఈ వార్తతో మరింత పెరిగాయి.
వార్ 2లో నాటు నాటు లాంటి పాటను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్స్‌గా పేరున్న హృతిక్, తారక్ కలిసి స్టెప్ప్ వేస్తే థియేటర్లల పూనకాలు పక్కా అంటున్నారు అభిమానులు. అందుకే ఈ స్టార్ల ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్‌లో అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారట మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్. వార్ 1లో హృతిక్, టైగర్ కలిసి పని చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ పాటను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఆ సాంగ్ సినిమా సక్సెస్‌లోనూ కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం ప్రిపేర చేస్తున్నారు. అయితే ఈ సారి స్కేల్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
25 కోట్లు ఖర్చు చేశారు
ఇక సినిమా కోసం ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేశారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు, చాలా మంది బైక్ రైడర్లు విన్యాసాలు చేస్తూ కనిపిస్తారు. ఈ ఒక్క సీక్వెన్స్ కోసం మేకర్స్ 25 కోట్లు ఖర్చు చేశారట. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇంకా కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ ల డ్యాన్స్ సీక్వెన్స్
ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న డ్యాన్స్ సీక్వెన్స్ ఇంకా షూట్ కాలేదు. దీని షూటింగ్ ఫిబ్రవరి మధ్యలో జరుగుతుందని టాక్. ఈ డ్యాన్స్ సీక్వెన్స్‌లో కొన్ని ప్రత్యేకమైన కొరియోగ్రఫీని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగం 2019లో వచ్చింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత రెండో భాగాన్ని తీసుకురాబోతున్నారు మేకర్స్. చివరి భాగంలో టైగర్ ష్రాఫ్ కూడా కనిపించాడు. అయితే పార్ట్ 2 లో కియారా అద్వానీ నటిస్తుంది. వార్ 2′ ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇది జూనియర్‌కి బాలీవుడ్ డెబ్యూ సినిమా. ఇంతకు ముందు ఏ హిందీ సినిమాలోనూ నటించలేదు.