Vaibhav Suryavanshi: 13 సంవత్సరాల వయసులోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్య వంశీ.. ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున అతడు లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ గాయపడ్డాడు. దీంతో అతడు లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్ కు దూరమయ్యాడు. రియాన్ పరాగ్ ప్రస్తుతం రాజస్థాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజస్థాన్ జట్టులోకి వైభవ్ సూర్య వంశీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వైభవ్ సూర్య వంశీ వయసు 14 సంవత్సరాలు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 14 సంవత్సరాల వయసులోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్య వంశీ రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్య వంశీ బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతడు తాజ్పూర్ సమస్తి పూర్ ప్రాంతంలో పుట్టాడు. స్కూల్ దశలో తండ్రి వద్ద క్రికెట్ పాఠం నేర్చుకున్నాడు. వైభవ్ సూర్య వంశీ తండ్రి స్థానికంగా ఉన్న పత్రికలో పార్ట్ టైం జర్నలిస్టుగా పనిచేస్తుంటాడు. కొడుకు ఆసక్తిని గమనించి అతడి కోసం ప్రత్యేకంగా మైదానాన్ని రూపొందించాడు.. 8 సంవత్సరాల వయసులో అండర్ -16 జిల్లా ట్రయల్స్ లో పోటీపడ్డాడు. ఆ తర్వాత ఎదురేలేదన్నట్టుగా తన ఆట తీరు చూపించాడు. అద్భుతమైన గేమ్ ప్లాన్ ప్రదర్శించాడు. బీహార్ జట్టులో స్థానం కూడా సంపాదించాడు. గత ఏడాది జనవరిలో బీహార్ రంజి జట్టులో ప్రవేశించాడు. ఆ తర్వాత బీహార్ జట్టు తరఫున ఆడిన రెండవ అతి చిన్న వయసున్న ఆటగాడిగా.. రంజి చరిత్రలో బీహార్ తరఫున ఆడిన నాలుగవ అత్యంత చిన్న వయసున్న ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ముంబై జట్టుతో జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు సచిన్, యువ రాజ్ సింగ్ ను అధిగమించి.. రంజి ట్రోఫీలో అత్యంత చిన్న వయసున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు..
Also Read: 18 ఏళ్ల క్రితం సంచలనం.. ఇప్పుడేమో యాదృచ్ఛికం.. ఐపీఎల్ లో ఇదో అద్భుతం!
రంజీలలో సరికొత్త రికార్డులు
గత ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా అండర్- 19 జట్టుతో జరిగిన మ్యాచ్లో 58 బంతులు మాత్రమే ఎదుర్కొని వైభవ్ సెంచరీ చేశాడు. భారత అండర్ 19 క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశం నిలిచాడు. అదే కాదు గత ఏడాది అక్టోబర్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన అండర్ 19 మ్యాచ్ లో భారత జట్టు తరఫున 62 బంతుల్లోనే 104 పరుగులు చేసి వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాదు అండర్ 19 లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. అండర్ 19 ఆసియా కప్ లో శ్రీలంక జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 67 పరుగులు చేశాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం గెలుచుకున్నాడు.