Vijayashanti: నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram), విజయశాంతి(Vijayashanti) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అర్జున్ S/O వైజయంతి'(Arjun S/O Vyjayanthi) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. వేసవి కాలం లో సరైన సినిమా లేక ఈగలు తోలుకుంటున్న థియేటర్స్ కు ఈ సినిమా సరికొత్త ఊపు ని తీసుకొస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఓపెనింగ్స్ అంతంత మాత్రం గానే వచ్చాయి. డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, అవి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఏ మాత్రం సరిపోవు. లాంగ్ రన్ వస్తుంది అనే బలమైన నమ్మకం కూడా లేదు. దీంతో ఈ చిత్రం కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. మరి హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది సోమవారం వచ్చే కలెక్షన్స్ ని బట్టి తెలుస్తుంది కానీ, ఈరోజు మూవీ టీం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో కళ్యాణ్ రామ్, విజయశాంతి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: సక్సెస్ మీట్ లో అబద్దాలు చెప్పిన నందమూరి కళ్యాణ్ రామ్..వీడియో వైరల్!
ముందుగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ చిత్రం మంగళవారం లోపు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విజయశాంతి దాదాపుగా 15 నిమిషాలకు పైగా మాట్లాడింది. ఈ 15 నిమిషాల్లో ఆమె క్రిటిక్స్ ని ఉద్దేశిస్తూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతున్నాయి. రివ్యూస్ ఇచ్చే వాళ్ళు విజయశాంతి పై మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె ఏమి మాట్లాడిందంటే ‘ప్రతీ ఒక్క సినిమా ఆడాలని మేమంతా కోరుకుంటాము. ఏ సినిమాని కూడా డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నా సినిమాని బాగాలేదని, బాగాలేని సినిమాని బాగుందని చెప్తున్నారు, ఏమిటిది అసలు?, ఇది సరైన పద్దతి కాదు, దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తున్నారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ ని దయచేసి బ్రతకనివ్వండి, అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, ఆ సినిమాని తీసేవాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీ కి వస్తారు, వాళ్ళని దయచేసి ఆశీర్వదించండి, మీకు సినిమా నచ్చకపోతే సైలెంట్ గా ఉండండి, అంతే కానీ సినిమాని ఖూనీ చేద్దామని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నారు కదా, వాళ్లకి నేను సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను. సినిమాని థియేటర్స్ లో చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉందంటూ చెప్తున్నారు, కానీ మీకు ఏమైంది’ అంటూ విజయశాంతి ఫైర్ అయ్యింది. దీనిపై రివ్యూయర్స్ స్పందిస్తూ అక్కడ హీరో ఏమో మంగళవారానికి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అంటాడు, ఇక్కడ ఈమె ఏమో రివ్యూయర్స్ నెగటివ్ ఇచ్చారు, కలెక్షన్స్ రావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది, ఎక్కడా పొంతన లేదే అంటూ మండిపడుతున్నారు. ఆమె మాట్లాడిన వీడియో ని క్రింద అందిస్తున్నాము, చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.