Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ ఐపీఎల్ లో సుదీర్ఘకాలం బెంగళూరు జట్టుకు ఆడాడు. అయితే ఆ జట్టులో అతను సరిగ్గా ప్రతిభ చూపించలేకపోవడంతో బెంగళూరు జట్టు యాజమాన్యం గత ఏడాది చివర్లో జరిగిన మెగా వేలంలో సిరాజ్ ను రిటైన్ చేసుకోలేదు. దీంతో మహమ్మద్ సిరాజ్ మెగా వేలంలోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో అతడిని గుజరాత్ జట్టు కొనుగోలు చేసింది. తనను బెంగళూరు జట్టు దూరం పెట్టడంతో మహమ్మద్ సిరాజ్ దానిని సీరియస్ గా తీసుకున్నాడు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం లభించకపోవడం.. టీమిండియా ఆడిన టి20 సిరీస్ లలోనూ చోటు లభించకపోవడంతో.. మహమ్మద్ సిరాజ్ ఈ అంశాలను అత్యంత సీరియస్ గా తీసుకున్నాడు. ఇందులో భాగంగానే తనను తాను మలుచుకున్నాడు. మైదానంలో తీవ్రంగా కసరత్తు చేశాడు. చివరికి తన బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. చివరికి అనుకున్నది సాధించాడు. గుజరాత్ జట్టు తరఫున ఆడుతున్న అతను తన బౌలింగ్లో కొత్తదనాన్ని ఆవిష్కరిస్తున్నాడు.
Also Read: వైభవ్ సూర్య వంశీ తో లక్నో ఓనర్ ఏం మాట్లాడాడు?: తర్వాత జరిగేది అదేనా?
ఇదంతా విరాట్ వల్లే
గుజరాత్ జట్టు లో కీలక బౌలర్ గా సేవలందిస్తూ .. ఐపీఎల్ లో అదరగొడుతున్న మహమ్మద్ సిరాజ్.. “క్రిక్ బజ్” తో మాట్లాడాడు. ఈ సందర్భంగా సంచలన విషయాలను పంచుకున్నాడు. ” నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇక్కడ దాకా రావడానికి తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నాను. చివరికి టీమ్ ఇండియాలో స్థానం సంపాదించాను. అందరి ఆటగాళ్ల మాదిరిగానే నా జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. ఉద్దాన పతనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. నేను కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఇబ్బంది పడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ నాతో మాట్లాడేవాడు. నాలో పాజిటివిటీ నింపేవాడు. నేను ఆ సమయంలో తీవ్రంగా మదనపడేవాడిని. అప్పుడు విరాట్ కోహ్లీ స్ఫూర్తిని నింపే మాటలు మాట్లాడేవాడు. దానివల్ల నాలో కొత్త శక్తి వచ్చేది. అది సానుకూల వాతావరణాన్ని నాలో నింపేది. నేను ఇప్పుడు గుజరాత్ జట్టు తరపున ఇలా బౌలింగ్ చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీనే. విరాట్ కోహ్లీ నాలో అంత ప్రభావాన్ని చూపించాడు. అందువల్లే నేను ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేస్తున్నాను. విరాట్ కోహ్లీ గనక అప్పుడు అలా మాట్లాడకపోయి ఉంటే.. నాలో ఇలా స్ఫూర్తినింపక పోయి ఉంటే నేను ఏమైపోయేవాడినో.. విరాట్ భాయ్ కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని” మహమ్మద్ సిరాజ్ వ్యాఖ్యానించాడు. ఇక ప్రస్తుతం గుజరాత్ జట్టులో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు . గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్, సిరాజ్ మధ్య మంచి స్నేహం ఉంది. అందువల్లే అతడికి విస్తృతంగా అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నాడు.
Also Read: వైభవ్ సూర్య వంశీ.. సోషల్ మీడియాలో ఈ బుడ్డోడే ఇప్పడు వైరల్