Vaibhav Suryavanshi: ఇటీవల ఆసియా రైజింగ్ స్టార్ టోర్నీలో టీమిండియా సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కూర్పు పట్ల అనేక రకాల విమర్శలు వచ్చాయి. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం పట్ల అనేక ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న మేనేజ్మెంట్ త్వరలో డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్ వేదికగా జరిగే అండర్ 19 ఆసియా కప్ లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.
దుబాయ్ వేదికగా జరిగే అండర్ 19 ఆసియా కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. భారత జట్టుకు ఆయుష్ మాత్రే నాయకత్వం వహిస్తాడు. ఐపీఎల్ లో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవల అతడు రైజింగ్ స్టార్ ఆసియా కప్ లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్ అయ్యాడు. త్వరలో జరిగే అండర్ 19 వరల్డ్ కప్ కు ఇది సన్నాహకంగా ఉంటుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. అండర్ 19 వరల్డ్ కప్ జనవరి నుంచి ఫిబ్రవరి నెల మధ్య జింబాబ్వే, నమీబియా దేశాల మధ్య జరగనుంది.
వైభవ్ సూర్య వంశీ రాకతో జట్టు మరింత బలోపేతం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అతడు ఐపిఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున అద్భుతాలు సృష్టించాడు. ఏకంగా సెంచరీ కూడా చేశాడు. లెజెండరీ బౌలర్ల బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏ మాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే అతడిని మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకొని.. జట్టులోకి ఎంపిక చేసింది. ఆసియా రైజింగ్ స్టార్ టోర్నీ మాదిరిగానే.. ఈ టోర్నీలో కూడా అతడు అద్భుతాలు సృష్టిస్తాడని మేనేజ్మెంట్ బలమైన నమ్మకంతో ఉంది.
ఇక ఇటీవల జరిగిన ఆసియా రైజింగ్ స్టార్ కప్ లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో వైభవ్ ను బ్యాటింగ్ కు పంపించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. అతడు గనుక బ్యాటింగ్ చేసి ఉంటే.. టీమిండియా భారీ స్కోర్ చేసి ఉండేదని.. తద్వారా విజయాన్ని సాధించి ఉండేదని అభిమానులు పేర్కొంటున్నారు.
ఆయుష్ (కెప్టెన్), వైభవ్, విహాన్ (వైస్ కెప్టెన్), వేదాంత, హరి వంష్ సింగ్, విజ్ఞాన్, యువరాజ్ గోహిల్, ఖిలాన్ ఎ. పటేల్, నమన్, దీపేష్, హెనీల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఆరోన్, ఉద్ధవ్.