Aaryan Movie Review: నటీనటులు : విష్ణు విశాల్, శివ రాఘవన్, శ్రద్ధ శ్రీనాథ్ తదితరులు…
డైరెక్టర్ : ప్రవీణ్ కే
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని భాషల వాళ్ళు డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం భాష తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ వస్తే ప్రేక్షకులు ఆ సినిమాలను చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అటు తెలుగులోనూ, ఇటు తమిళ్ లోను మంచి గుర్తింపును సంపాదించుకున్న విష్ణు విశాల్ ‘ఆర్యన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా గత రెండు వారాల క్రితమే థియేటర్లోకి వచ్చినప్పటికి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది… ఈ సినిమా ఆంతర్యం ఏంటి? ఇప్పటికే మర్డర్ మిస్టరీలతో చాలా సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజింగ్ చేసిందా లేదా అనేది తెలుసుకుందాం పదండి…
కథ
సిటీలోని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇక అక్కడికి ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ప్రేక్షకుడిలా వస్తాడు… ఇక ఆ ఛానల్ కి వచ్చిన ఒక సెలబ్రిటీ మీద ఆత్రేయ దాడి చేసి ఆమె కాలు మీద కాలుస్తాడు. దాంతో అటెన్షన్ మొత్తం ఆత్రేయ మీదకి వెళుతుంది… తను ఒక రచయితనని ఆయన జీవితం బాగాలేకపోవడంతో ఆయన ఇలా మారానని చెబుతాడు. అలాగే రాబోయే ఐదు రోజుల్లో ఐదుగురిని మర్డర్ చేయబోతున్నట్టుగా తాను చెప్పి వాళ్ళు చనిపోవడానికి గంట ముందు వాళ్లెవరో చెబుతానని చెప్పి తను తాను కాల్చుకొని చనిపోతాడు… నిజానికి ఆయన చనిపోయిన తర్వాత మర్డర్స్ ఎలా జరుగుతాయి. అసలు మర్డర్స్ చేయడానికి తన మోటివ్ పాయింట్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఆత్రేయ చెప్పినట్టుగా ఎవరు చనిపోతున్నారు అనే పాయింట్ లో ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీలను ఎక్కువగా సాల్వ్ చేయగలిగే కెపాసిటి ఉన్న నంది(విష్ణు విశాల్) కి ఈ కేస్ ని అప్పచెబుతారు. సరిగ్గా మర్డర్ జరిగే గంట ముందు ఆ మర్డర్ అవ్వబోయే వ్యక్తి ఎవరో చెబుతాడు… నిజానికి ఆత్రేయ చనిపోయిన తర్వాత కూడా ఎంచుకున్న వ్యక్తులను ఎలా చంపబోతున్నాడనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చిత్రీకరించారు. ముఖ్యంగా ఆయన వాడిన టెక్నాలజీని సైతం బాగా ఎలివేట్ చేశారు. ఇక నంది ఎంచుకున్న ఇన్వెస్టిగేషన్ మార్గం మాత్రం చాలా రొటీన్ గా ఉంది. ఇప్పటికే మనం చాలా సినిమాల్లో అలాంటి ఇన్వెస్టిగేషన్ చూశాం…
అందువల్లే ఈ సినిమా చూస్తున్నంత సేపు రొటీన్ సినిమా చూసినట్లే అనిపిస్తోంది. కానీ క్లైమాక్స్లో మాత్రం చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అయిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకవేళ క్లైమాక్స్ ఇంకాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఉంటే సినిమా మీద ఇంకాస్త ఇంపాక్ట్ వచ్చుండేది… మ్యూజిక్ కూడా ఓకే అనిపించేలా ఉంది. విజువల్స్ అయితే బాగున్నాయి…ఇక హీరో విష్ణు విశాల్ చాలా అద్భుతంగా నటించాడు. కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నిజంగా పోలీస్ ఆఫీసర్ ను చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది…సెల్వరాఘవన్ కనిపించింది కొద్దిసేపు అయిన కూడా తన పాత్రతోనే సినిమా మొత్తం నడుస్తుంటాం వల్ల అతని క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది…
సినిమాలోని ఎమోషన్ ని బాగా వాడుకునే ప్రయత్నం చేసినప్పటికి స్క్రీన్ ప్లే కాస్త బెటర్ గా ఉంటే సినిమా బాగా వర్కౌట్ అయ్యేది… ఈ సినిమాని చూస్తున్నంత సేపు రొటీన్ సినిమాలు చూసినట్టుగానే అనిపించింది. ఇన్వెస్టిగేషన్లో ఇంకాస్త బెటర్మెంట్ కనిపించాల్సింది. ఎప్పుడైతే సినిమా సెకండాఫ్ లోకి ఎంటర్ అయిందో అప్పటినుంచి అన్ని బోరింగ్ సన్నివేశాలు రావడం వల్ల ప్రేక్షకుడు విసుగు చెందే అవకాశాలైతే ఉన్నాయి…
క్లైమాక్స్ చాలా కొత్తగా డిజైన్ చేసినప్పటికి దాన్ని చూసిన ప్రేక్షకుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడనేది చాలామందికి అర్థం కావడం లేదు… సినిమాలను చేసినప్పుడు ట్రీట్మెంట్ గాని స్క్రీన్ ప్లేన్ గాని చాలా కొత్తగా రాసుకోవాలి. వాటి మీద సినిమా మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కథ రొటీన్ గా ఉన్నా కూడా ట్రీట్మెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకుడికి ఎంగేజింగ్ గా ఉంటుంది.
అలా కాకుండా రొటీన్ ఫార్మాట్లోనే సినిమాను తీసుకుపోయి సక్సెస్ ని సాధించాలి అంటే మాత్రం ఈ రోజుల్లో ఎవరు అలాంటి సినిమాలను చూడడం లేదు. ఎందుకంటే ఓటిటి లో మొత్తం థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి. కాబట్టి వాటిని మించి మనం ఏమైనా చేస్తే బాగుంటుంది. అంతేతప్ప ఇంతకుముందు వచ్చిన సినిమాల మాదిరిగానే మన సినిమా కూడా మూస ధోరణిలో ఉంటే ఎవరు పట్టించుకోరనేది వాస్తవం…
ఇందులో బాగున్నవి ఇవే…
ఫస్టాఫ్ లోని కొన్ని సీన్స్
ఎమోషనల్ సీన్స్
బాగోలేనివి ఇవే…
కథ
ఇన్వెస్టిగేషన్ సీన్స్
రేటింగ్ : 2/5
థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమున్న వాళ్ళు ఖాళీ సమయం ఉంటే ఒకసారి ట్రై చేయండి…
