Vaibhav Surya Vamsi: కేవలం 14 సంవత్సరాల వయసులోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తద్వారా అత్యంత చిన్న వయసులోనే ఐపిఎల్ ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు శార్దూల్ ఠాకూర్ లాంటి సీనియర్ బౌలర్ బౌలింగ్లో తొలి బంతినే భారీ సిక్సర్ కొట్టాడు. ఏకంగా స్టేడియం అవతలికి పంపించాడు.. 20 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. టి20 ఇదేం పెద్ద స్కోర్ కాకపోయినప్పటికీ.. అతని వయసులో ఈ స్థాయిలో పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు. 34 పరుగులు చేసిన అతడు మార్క్రం బౌలింగ్లో రిషబ్ పంత్ చేతిలో స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఏడ్చుకుంటూ వైభవ సూర్యవంశీ పెవిలియన్ చేరుకున్నాడు. అతడు ఏడ్చిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అయ్యో బుడ్డోడా ఏడవకు అంటూ నెటిజన్లు ఊరడించడం మొదలుపెట్టారు.
Also Read: ఓటముల్లో రాజస్థాన్.. గెలుపుల్లో లక్నో.. ఐపీఎల్ లో ఇదో సంచలనం
భావి సచిన్ అవుతాడు
తొలి మ్యాచ్ ఆడుతున్నాననే భయం లేకుండానే వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ చేశాడు. అలావోకగా బంతులను కొట్టాడు. శార్దుల్ ఠాకూర్ వేసిన తొలి బంతినే సిక్సర్ కొట్టాడు. చూడముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్నాడు. కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసు మాత్రమే అయినప్పటికీ.. ఆటలో ఎంతో హుందాతనాన్ని చూపించాడు. అద్భుతమైన రిథంతో బ్యాటింగ్ చేశాడు. ఒకానొక దశలో అతడు హాఫ్ సెంచరీ చేసే విధంగా కనిపించాడు. దురదృష్టవశాత్తు ఫుట్ మీద గ్రిప్ కోల్పోయి స్టంప్ అవుట్ అయ్యాడు. మార్క్రం బౌలింగ్లో లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బ్యాలెన్స్ కోల్పోయాడు. చివరికి స్టంప్ ఔట్ అయ్యాడు. 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేయలేకపోయాననే బాధనో లేక పసితనం వల్లో ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఏడ్చుకుంటూనే డ్రెస్సింగ్ రూమ్ వెళ్ళిపోయాడు. అయితే అతడిని నెటిజన్లు ఊరడిస్తున్నారు. బాధపడకు రా చిన్నోడా.. భవిష్యత్తు కాలంలో సచిన్, విరాట్ లాంటి ఆటగాడివి అయిపోతావ్. ఇంకా కష్టపడు. మెరుగ్గా బ్యాటింగ్ చేయ్. దూకుడుగా ఆడు. నిన్ను నువ్వు నిరూపించుకో. సెల్యూట్ రా బాబు అంటూ నెటిజన్లు అంటున్నారు.
ఏం గుండెరా అది https://t.co/GGJA4KGOMt
— CricShiva (@shivauppala93) April 20, 2025
వైభవ్ సూర్య వంశీ ఏమాత్రం భయం లేకుండా ఆడుతున్న నేపథ్యంలో.. అతడిని రాజస్థాన్ అభిమానులు విపరీతంగా కీర్తిస్తున్నారు. రాజస్థాన్ జట్టుకు అద్భుతమైన ఆటగాడు లభించాడని పేర్కొంటున్నారు. అంతేకాదు అతడి రాక వల్ల జట్టుకు సరికొత్త శక్తి లభించిందని వ్యాఖ్యానిస్తున్నారు . వైభవ్ సూర్య వంశీ భయం లేకుండా బ్యాటింగ్ చేయడం ఆకట్టుకుంటున్నదని వారు పేర్కొంటున్నారు. వైభవ్ సూర్య వంశీ ఇలానే ఆడితే మాత్రం రాజస్థాన్ జట్టు మరింత బలంగా ఉంటుందని.. ఇంకా గొప్ప గొప్ప విజయాలు సాధిస్తుందని రాజస్థాన్ రాయల్స్ అభిమానులు పేర్కొంటున్నారు.
Vaibhav Suryavanshi showed them his calibre #vaibhavsuryavanshi #RRvsLSG pic.twitter.com/8uswbBLVfh
— Ministry Of Sarcasm (@M_OfSarcasm) April 19, 2025