Homeక్రీడలుక్రికెట్‌Usman Tariq Comments On Sri Lanka Security Checks: ఉస్మాన్ తారీఖ్.. నీ దేశమే...

Usman Tariq Comments On Sri Lanka Security Checks: ఉస్మాన్ తారీఖ్.. నీ దేశమే ఉగ్రవాదుల స్థావరం.. బ్యాగులను అలానే తనిఖీ చేస్తారు

Usman Tariq Comments On Sri Lanka Security Checks: ‘మేం భారత జట్టుతో ఓడిపోయినందుకు బాధపడటం లేదు. శ్రీలంకలో మా జట్టు ఆటగాళ్ల బ్యాగులను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేశారు. అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. భారత ప్లేయర్ల బ్యాగులను శ్రీలంక పోలీసులు తనిఖీ చేయలేదు.’ ఈ మాటలు అన్నది పాకిస్థాన్ బౌలర్ ఉస్మాన్ తారీఖ్.

పాకిస్థాన్ ప్లేయర్ గా, పాకిస్థాన్ జాతీయుడుగా ఉస్మాన్ ఆ మాటలు అనడంలో ఆశ్చర్యం కలగ లేదు. కానీ, అనేక విషయాలను ఇక్కడ ఉస్మాన్ మర్చిపోతున్నాడు. పాకిస్థాన్ అనేది ఉగ్రవాదుల స్థావరం. ఆ మాట అన్నది అక్షరాల అమెరికా. పైగా లాడెన్ లాంటి మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదిని హతమార్చింది పాకిస్థాన్ లోనే.

కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంక ఆటగాళ్లు టోర్నీ ఆడేందుకు పాకిస్థాన్ వెళ్తే అక్కడి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శ్రీలంక ప్లేయర్లు చావు చివరి అంచు దాకా వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ దేశంలో చాలా సంవత్సరాల వరకు ఏ జట్టూ పర్యటించలేదు.

ఉస్మాన్ తారిఖ్ నిలదీయాల్సింది శ్రీలంక పోలీసులను కాదు.. పాకిస్థాన్ ప్రభుత్వ పెద్దలను . సస్యశ్యామలంగా ఉండే దేశాన్ని ఉగ్రవాదుల శిబిరంగా ఎందుకు మార్చారని ఆ దేశ ప్రభుత్వ పాలకులను. ఇమ్రాన్ ఖాన్ లాంటి లెంజడరీ ప్లేయర్ ను జైలు పాలు ఎందుకు చేశారని ఉస్మాన్ తారిఖ్ అడగాలి.

భారత్ లో విదేశీ క్రికెటర్లను ఎలా చూసుకుంటారో అందరికీ తెలుసు. వుమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, వుమెన్స్ ప్రిమీయర్ లీగ్ వంటి టోర్నీలలో ఆడేందుకు చాలా మంది మహిళా క్రికెటర్లు ఇండియాకు వచ్చారు. స్వేచ్ఛగా విహరించారు. అక్కడి దాకా ఎందుకు ప్రస్తుత టీ 20 వరల్డ్ కప్ లో ఆడేందుకు ఇంగ్లాండ్ ప్లేయర్లు వచ్చారు. వారు కూడా ముంబై వీధులలో తిరిగారు.

పాపం ఈ విషయాలు తెలుసో? తెలియదో? ఉస్మాన్ తారీఖ్ పాకిస్థాన్ శాంతికాముక దేశమని.. పాకిస్థాన్ ప్లేయర్లు గొప్ప వాళ్లు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. గతంలో శ్రీలంక జట్టు మీద పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి విఫలయత్నం చేశారు. అలాంటప్పుడు పాకిస్థాన్ ప్లేయర్ల బ్యాగులను శ్రీలంక పోలీసులు కచ్చితంగా తనిఖీ చేస్తారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular