Homeఎంటర్టైన్మెంట్Hey Balvanth First Day Collections: 'హే బల్వంత్' మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..డివైడ్ టాక్...

Hey Balvanth First Day Collections: ‘హే బల్వంత్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..డివైడ్ టాక్ తో ఈ రేంజ్ గ్రాస్ ఊహించలేదు!

Hey Balvanth First Day Collections: విభిన్నమైన కథలను ఎంచుకొని, వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోల్లో ఒకరు సుహాస్(Actor Suhas). కమెడియన్ స్థాయి నుండి, నేడు హీరో గా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే రేంజ్ కి ఎదగడం అనేది చిన్న విషయం అయితే కాదు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘హే బల్వంత్'(Hey Balvanth Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ […]

Hey Balvanth First Day Collections: విభిన్నమైన కథలను ఎంచుకొని, వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోల్లో ఒకరు సుహాస్(Actor Suhas). కమెడియన్ స్థాయి నుండి, నేడు హీరో గా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే రేంజ్ కి ఎదగడం అనేది చిన్న విషయం అయితే కాదు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘హే బల్వంత్'(Hey Balvanth Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. డివైడ్ టాక్ అంటే ఫ్లాప్ అని ఎవరూ అనలేదు, కొంతమంది బాగుంది అని చెప్తే, మరికొంత మంది యావరేజ్ అని చెప్పారు. ఓవరాల్ గా ఈ చిత్రం డీసెంట్ రేంజ్ అనే చెప్పొచ్చు. టాక్ డీసెంట్ గా ఉండడంతో, ఓపెనింగ్స్ కూడా చాలా డీసెంట్ గా వచ్చాయి. మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.

బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మొదటి రోజున 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ట్రేడ్ విశ్లేషకులు ఇంకా ఎక్కువ ఆశించారు కానీ, ఎందుకో ఆ మేరకు పెర్ఫార్మ్ చేయలేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రం మొదటి రోజున తెలుగు రాష్ట్రాల నుండి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల కంటే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సుహాస్ పై ఓవర్సీస్ ఆడియన్స్ పెట్టినంత నమ్మకం, ఎందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆడియన్స్ పెట్టలేదని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఓవర్సీస్ ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి కేవలం నార్త్ అమెరికా నుండే ప్రీమియర్ షోస్ నుండి 80 వేల డాలర్లు వచ్చాయట.

ఓవరాల్ ఓవర్సీస్ లక్షా 50 వేల డాలర్లకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబట్టింది, మొదటి రోజుకి కలిపితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని , మొత్తం మీద ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి హే బల్వంత్ చిత్రం ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం ఓవర్సీస్ నుండి 80 లక్షల డాలర్లు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి , అవలీలగా మొదటి వారం లోనే ఆ మార్కుని ఈ చిత్రం కచ్చితంగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper