Fastest man Usain Bolt struggles: రెప్ప మూసి తెరిచేలోపే అతడు లక్ష్యాన్ని చేరుకునేవాడు. సుడిగాలి కంటే వేగంగా.. ధ్వని కంటే స్పీడ్ గా.. చిరుత పులి కంటే ఎక్కువగా పరుగులు తీసేవాడు. అనేక అంతర్జాతీయ పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించి తన మాతృదేశానికి అద్భుతమైన కీర్తిని అందించాడు. అంతేకాదు అథ్లెటిక్స్ రంగంలోనే అరుదైన రికార్డులను సృష్టించాడు. తన పేరును పరుగుకు పర్యాయపదంగా మార్చుకున్నాడు. తాను మైదానంలో అడుగు పెడితే రెండవ స్థానం కోసం పోటీ పడాల్సి ఉంటుందని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించేవాడు.. అలాంటి వ్యక్తి ఇప్పుడు మెట్లు ఎక్కడానికే ఇబ్బంది పడుతున్నాడు.
ఆధునిక అథ్లెటిక్స్ లో ఉస్సేన్ బోల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పరుగు పందెంలో అతడిని మించిన అథ్లెట్స్ లేరు. సిసలైన వేగంతో సరికొత్త రికార్డులు సృష్టించిన ఘనత అతని పేరు మీద ఉంది. అతని మాదిరిగా పరుగులు పెట్టాలని.. అతని మాదిరిగా మెడల్స్ అందుకోవాలని పోటీపడిన వారు చాలామంది. కానీ అతడు అథ్లెట్స్ లో ఉన్నంతవరకు ఆ రికార్డులను ఎవరూ బద్దలు కొట్టే సాహసం చేయలేకపోయారు. కనీసం అతనికి పోటీ ఇచ్చే స్థాయిలో కూడా ఉండలేకపోయారు. వచ్చిన అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకొని బోల్ట్.. తన పేరుని పరుగుకు పర్యాయపదంగా మార్చుకున్నాడు. ఎన్నో మెడల్స్ సాధించి శిఖరాగ్రాన నిలిచాడు.
అటువంటి బోల్ట్ ప్రస్తుతం ఫిట్నెస్ మొత్తం కోల్పోయాడు. అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. కనీసం మెట్లు కూడా ఎక్క లేక ఇబ్బంది పడుతున్నాడు. శ్వాస మీద నియంత్రణ సాధించలేక అవస్థలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తన బాధను అతడు వ్యక్తం చేశాడు. దానికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. 2017లో బోల్ట్ రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. పిల్లలకు తండ్రి అయ్యాడు. అప్పటినుంచి వ్యాయామం మీద పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో అతడు పరుగు మీద పట్టును కోల్పోయాడు. శ్వాస మీద నియంత్రణను కోల్పోయాడు. ఒకప్పుడు చిరుత పులి కంటే వేగంగా పరుగులు తీసిన అతడు.. ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇబ్బంది పడుతున్నాడు. బోల్ట్ దుస్థితి చూసి చాలామంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరుగుల యంత్రానికి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందని మదన పడుతున్నారు.