USA vs BAN : బంగ్లా పులి అనుకుంటే.. తోక జట్టు చేతిలో తోకముడిచింది..

విజయం అనంతరం అమెరికా జట్టు సంబరాలు చేసుకుంది. ఆ జట్టు అభిమానులు మైదానంలో కేరింతలు కొట్టారు. అమెరికా క్రికెట్ జట్టు సిరీస్ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

Written By: NARESH, Updated On : May 24, 2024 12:33 pm

USA vs BAN

Follow us on

USA vs BAN : అనుకున్నదే అయింది.. మాజీ క్రికెటర్లు హెచ్చరించిందే జరిగింది. అనామక అమెరికా చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయింది. 3 t20 ల సిరీస్ లో భాగంగా తొలి టి20 మ్యాచ్ ఓడిపోయి పరువు పోగొట్టుకున్న బంగ్లాదేశ్… రెండవ టి20 మ్యాచ్ కూడా ఓడిపోయి పరువు తీసుకుంది. రెండవ మ్యాచ్ లోనూ ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. దీంతో నెట్టింట బంగ్లాదేశ్ జట్టు ఆట తీరిన ఉద్దేశిస్తూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు..

టి20 ర్యాంకింగ్స్ లో బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా ఎక్కడో చివర్లో ఉంది. కానీ అలాంటి జట్టు చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయింది. సిరీస్ కూడా కోల్పోయింది. మూడు టి20 ల సిరీస్ లో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ఈ స్థాయిలో ఆట తీరు ప్రదర్శించడం పట్ల మాజీ క్రికెటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఇలా తేలిపోతున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ఈ సిరీస్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ వైట్ వాష్ చేస్తుందని అందరూ అనుకున్నారు. టి20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ కు పకడ్బందీ ప్రాక్టీస్ లభిస్తుందని భావించారు. కానీ, బంగ్లాదేశ్ ఆట తీరు అందుకు విరుద్ధంగా సాగుతోంది.. అనామక జట్టు చేతిలో ఓడిపోయి పరువు తీసుకుంటోంది..

ఇప్పటికే తొలి టి20 మ్యాచ్లో ఓడిపోయిన బంగ్లాదేశ్.. రెండవ మ్యాచ్ లోనూ ఓడిపోయింది. రెండవ టి20 మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 రన్స్ చేసింది. 145 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 138 పరుగులకే కుప్ప కూలింది. దీంతో మూడు టి20 సిరీస్ ను 2-0 తేడాతో అమెరికా సొంతం చేసుకుంది. టి20 వరల్డ్ కప్ ముందు సిరీస్ విజయం అమెరికా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. విజయం అనంతరం అమెరికా జట్టు సంబరాలు చేసుకుంది. ఆ జట్టు అభిమానులు మైదానంలో కేరింతలు కొట్టారు. అమెరికా క్రికెట్ జట్టు సిరీస్ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ టాపిక్ గా మారింది.