Tollywood : ఒక్క మూవీతో కుర్రాళ్ళ పిచ్చోళ్లను చేసిన ఈ క్రేజీ హీరోయిన్ ని గుర్తు పట్టారా? షాక్ అవుతారు!

సీరియల్ నటి అంటే చిన్న చూపు చూసేవారు. నల్లగా ఉన్నావు, మట్కా అని ఎగతాళి చేసేవారట. లవ్ సోనియా మూవీతో మృణాల్ కి బ్రేక్ వచ్చింది. సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకుంది.

Written By: NARESH, Updated On : May 24, 2024 12:26 pm
Follow us on

Tollywood : పైన ఫోటోలో ఉన్న క్యూటీ ఇప్పుడో స్టార్ హీరోయిన్. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి బడా హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగులో మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల గుండెల్లో పాగా వేసింది. ఈమెకు హిందీ, తెలుగు భాషల్లో పిచ్చ పాపులారిటీ ఉంది. ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా? మీ ఊహ నిజమే ఆ పాప మృణాల్ ఠాకూర్. 2022లో విడుదలైన సీతారామం చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఆ మూవీలో సీత పాత్రలో ఆమె అద్భుతం చేసింది. దుల్కర్ సల్మాన్-మృణాల్ కెమిస్ట్రీ గొప్పగా పండింది. మొదటి చిత్రంతోనే తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ని ఆమె ఏర్పాటు చేసుకుంది. ఇక రెండో చిత్రం హాయ్ నాన్న సైతం హిట్. హాయ్ నాన్న లో కూడా మృణాల్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. కథలో భాగంగా ఉంటుంది. మృణాల్ గ్లామర్ సినిమాకు హైలెట్. ఆమె పాత్రలో ట్విస్ట్ కూడా మెప్పిస్తుంది.

ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని నెగిటివ్ పబ్లిసిటీ దెబ్బ తీసిందనే వాదన ఉంది. దిల్ రాజు నెగిటివ్ కామెంట్స్, రివ్యూల మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఓ వర్గం పనిగట్టుకొని ఫ్యామిలీ స్టార్ ని దెబ్బ తీశారని మండిపడ్డారు.

కాగా మృణాల్ ఠాకూర్ కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. ఆమె పలు హిందీ సీరియల్స్ లో నటించారు. సీరియల్స్ చేస్తూనే సినిమాల్లో ట్రై చేసింది. ఈ క్రమంలో అనేక అవమానాలు ఎదురయ్యాయని మృణాల్ చెప్పుకొచ్చారు. సీరియల్ నటి అంటే చిన్న చూపు చూసేవారు. నల్లగా ఉన్నావు, మట్కా అని ఎగతాళి చేసేవారట. లవ్ సోనియా మూవీతో మృణాల్ కి బ్రేక్ వచ్చింది. సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకుంది.