Araku Loya: పర్యాటక రంగానికి( tourism) అధిక ప్రాధాన్యం ఇస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే టూరిజం పాలసీని అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఏపీ ఊటీగా పేరుగాంచిన అరకులో చలి పండుగా నిర్వహించేందుకు సిద్ధమయింది. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగ రేపు సాయంత్రం ప్రారంభం కానుంది. ఈ పండుగలు పర్యాటకుల కోసం పలు ఆకర్షణీయమైన కార్యక్రమాలను, పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అరకును ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించి సేద తీరుతుంటారు. అటువంటి వారికి ఇప్పుడు చలి పండుగ ఆహ్వానం పలుకుతోంది.
* తొలిరోజు ఇలా
అరకు లోయలోని( Araku loya ) ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ చలి పండుగను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 7:30 గంటల నుంచి పదిన్నర వరకు పద్మాపురం గార్డెన్ నుంచి కార్యక్రమ ప్రధాన వేదిక వరకు అరకు మారథాన్ పరుగు నిర్వహిస్తారు. 11 గంటలకు పద్మాపురం గార్డెన్స్ లో ఫ్లవర్ షో, 12 గంటలకు అరకు ట్రైబల్ మ్యూజియంలో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఫుడ్ స్టాల్స్ ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం మూడు గంటలకు పద్మాపురం గార్డెన్స్ నుంచి డిగ్రీ కాలేజీ వరకు కార్నివాల్ పరేడ్ ఉంటుంది. సాయంత్రం ఐదు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఇందులో గిరిజన సంప్రదాయ నృత్యాలు కూడా ఏర్పాటు చేశారు.
* రెండో రోజు కార్యక్రమాలు
రెండో రోజు అంటే.. ఫిబ్రవరి 1న బొర్రా గుహల( Borra Caves) నుంచి అరకు డిగ్రీ కాలేజీ వరకు సైక్లింగ్ ఈవెంట్ ఉంటుంది. అరకు ఎంపీడీవో కార్యాలయం వద్ద 11 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. 12 గంటలకు డిగ్రీ కాలేజీలో అరకు బొకే ఇనాగరేషన్ ఉంటుంది. అనంతరం వాటి అమ్మకాలు కూడా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు అరకు కాఫీ హౌస్ లో కాఫీ పరిచయం ఉంటుంది. మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగునుంది. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఫ్యాషన్ షో, ఇతర కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.
* రైడ్ కోసం హెలిక్యాప్టర్
ఫిబ్రవరి 2న ఆదివారం ఉదయం ఏడు గంటలకు అరకు సుంకమెట్ట కాఫీ తోటల నుంచి అరకు ట్రక్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి అరకులో వాల్ పెయింటింగ్, 11 గంటలకు ముగ్గులు పోటీ ఉంటుంది. 12 గంటలకు ట్రైబల్ మ్యూజియంలో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో కూడా ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజులపాటు అరకులో హెలిక్యాప్టర్ రైడ్ కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. హెలికాప్టర్ ఎక్కి అరకు పరిసర ప్రాంతాలను వీక్షించవచ్చు