U19 World Cup 2026 Schedule: ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు కాబట్టి.. భారత్, పాకిస్తాన్ ఐసీసీ నిర్వహించే మెగాటోర్నీలలో తలపడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత న్యూట్రల్ వేదికల మీదుగానే ఈ రెండు జట్లు ఆడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. పైగా ఈ పోటీకి విపరీతమైన క్రేజీ ఉంటుంది. కేవలం జాతీయ జట్లు మాత్రమే కాదు.. అండర్ 19 లో కూడా భారత్, పాకిస్తాన్ పోరు అంటే ఒక రేంజ్ లో ఉంటుంది.
వచ్చే ఏడాది జరిగే అండర్ 19 వన్డే వరల్డ్ కప్ కోసం ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో ఈసారి చాలా విభిన్నతను అంతర్జాతీయ క్రికెట్ మండలి పాటించింది. వచ్చే ఏడాది జరిగే అండర్ 19 వరల్డ్ కప్ కోసం జింబాబ్వే, నమిబియా ఆతిథ్యం ఇస్తున్నాయి. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. భారత్, పాకిస్తాన్ వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు పరస్పరం తలపడవు. ఈ టోర్నీలో టీమిండియా తన మొదటి మ్యాచ్ అమెరికాతో ఆడుతుంది. మొత్తం ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. 23 రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. 41 మ్యాచ్లను ఐసీసీ నిర్వహిస్తోంది.
గ్రూప్ ఏ లో బంగ్లాదేశ్, భారత్, యూఎస్ఏ, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్ బీ లో జింబాబ్వే, పాకిస్తాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ సీ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, జపాన్, ఐర్లాండ్, గ్రూప్ డి లో టాంజానియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టాంజానియా తొలిసారి ఈ టోర్నీలో ఆడుతోంది. 2020 తర్వాత జపాన్ లో ఆడుతోంది.
జనవరి 15న అమెరికాతో, 17వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో, 24వ తేదీన న్యూజిలాండ్ జట్టుతో భారత్ పోటీపడుతుంది. బులవాయో లోనే టీమిండియా అన్ని మ్యాచ్లు ఆడుతుంది. ఈ మ్యాచ్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతాయి. గ్రూప్ దశలో ప్రతి విభాగం నుంచి టాప్ 3 లో నిలిచిన జట్లు సూపర్ 6 కు వెళ్తాయి. నాలుగు జట్లు సెమీఫైనల్స్ వెళ్తాయి. రెండు జట్లు ఫైనల్ వెళ్లి ట్రోఫీ కోసం పోరాడుతాయి. 2024 సీజన్లో ఫైనల్ బ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారత్ ను ఓడించి ట్రోఫీని అందుకుంది. ఇక ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు భారతి ఇప్పటివరకు ఐదుసార్లు ఈ కప్ సాధించింది. 2000, 2008, 2012, 2018, 2022 సంవత్సరాలలో టీమిండియా విజేతగా నిలిచింది. అండర్ 19 వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియా అత్యధిక సార్లు విజేతగా నిలిచింది.