Shubman Gill: మెడ కండరాల నొప్పితో బాధపడుతున్న గిల్.. రెండవ టెస్టులో కూడా ఆడడు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. గిల్(shubman Gil) మెడ కండరాల నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో.. అతడు అంతగా సౌకర్యవంతంగా లేడని.. వైద్యుల సూచనల మేరకు రెండవ టెస్టులో ఆడటం లేదని బీసీసీఐ (BCCI) ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈనెల 22 నుంచి గుహవాటి వేదికగా రెండవ టెస్ట్ మొదలు కాబోతోంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్లు మొత్తం అక్కడికి చేరుకున్నారు. జట్టు సభ్యులతో కలిసి గిల్ అక్కడికి వెళ్ళాడు. జట్టు సభ్యులతో వెళ్లిన నేపథ్యంలో అతడు రెండవ టెస్టు ఆడతాడని అందరూ అనుకున్నారు. బీసీసీఐ కూడా అతని ఆరోగ్యం గురించి గోప్యత పాటించింది. ఫలితంగా గిల్ ఆరోగ్యంగా ఉన్నాడని.. కచ్చితంగా ఆడతాడని వార్తలు వినిపించాయి. కానీ అవి నిజం కాదని తేలిపోయింది.
గిల్ ఆరోగ్యం ఇంకా మెరుగు కాలేదని.. అతడు ప్రయాణాలు చేయకూడదని.. కఠినమైన పరిస్థితుల్లో ఉండకూడదని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో సాయి సుదర్శన్ ను ఆడిస్తారని తెలుస్తోంది.. సాయి సుదర్శన్ తొలి టెస్ట్ లో ఆడతాడని భావించినప్పటికీ.. అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశాడు. సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ సిరీస్లో అంతగా ఆకట్టుకోలేదు. స్వదేశంలో జరుగుతున్న సిరీస్ కాబట్టి మేనేజ్మెంట్ అతడికి అవకాశం ఇచ్చింది. మొదటి టెస్టులో ఆడే అవకాశం రాకపోయినప్పటికీ.. రెండో టెస్టులో గిల్ గాయపడిన నేపథ్యంలో అతడికి మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది.. సాయి సుదర్శన్ కు గుహవాటి మైదానంలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఈక్రమంలో అతడు రెండో టెస్టు లో సత్తా చూపిస్తాడని మేనేజ్మెంట్ భావిస్తోంది.
సాయి సుదర్శన్, గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలకమైన ప్లేయర్లుగా ఉన్నారు. గుజరాత్ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. సాయి సుదర్శన్ కు జట్టులో చోటు లభించడం వెనక గిల్ ఉన్నాడని తెలుస్తోంది. అతడు సిఫారసు చేయడంతో గిల్ ను జట్టులోకి తీసుకున్నారని సమాచారం. అతడు గనుక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జట్టులో స్థానం సుస్థిరమవుతుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. గుహవాటి టెస్టులో అదరగొట్టాలని సాయి సుదర్శన్ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. విభిన్నంగా బంతులు వేయించుకొని బ్యాటింగ్ చేస్తున్నాడు.