Bigg Boss 9 Telugu Tanuja: తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు అందరూ అబ్బాయిలే టైటిల్ విన్నెర్స్ గా నిలిచారు కానీ, ఒక్క అమ్మాయి కూడా టైటిల్ విన్నర్ గా నిలబడలేదు. కానీ ఈ సీజన్(Bigg Boss 9 Telugu) లో మాత్రం తనూజ ఫైర్ బ్రాండ్ లాగా ఉండడం, ఆమె కచ్చితంగా టైటిల్ గెలుస్తుంది అనే నమ్మకం ఆడియన్స్ కి రావడం తో ఆమెకు భారీ ఓటింగ్ వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సీజన్ లో తనూజ కి దరిదాపుల్లోకి వచ్చే కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆమెకు, రెండవ స్థానం లో ఉన్న కంటెస్టెంట్ కళ్యాణ్ కి మధ్య కి కనీసం 30 శాతం తేడా ఉంటుంది. ఈ రేంజ్ డామినేషన్ బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా చూపించలేదు. అయితే గెలుపు ఏకపక్షంగా ఉండకూడదు అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, బిగ్ బాస్ టీం ఈమధ్య కాలం లో తనూజ ని తగ్గించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
రెండవ స్థానం లో ఉన్న పవన్ కళ్యాణ్ ని పైకి లేపేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది బిగ్ బాస్ టీం. గత వీకెండ్ నుండి ఇప్పటి వరకు తనూజ ని నెగిటివ్ చేయడానికి చిన్న పాయింట్ దొరికినా అసలు ఆగడం లేదు బిగ్ బాస్ టీం. ఉదాహరణకు నిన్నటి నుండి ఫ్యామిలీ వీక్ మొదలైంది. ముందుగా సుమన్ శెట్టి భార్య హౌస్ లోకి వచ్చింది, ఆ తర్వాత తనూజ సోదరి హౌస్ లోపలకు వచ్చింది. కానీ వీళ్ళందరికీ హౌస్ లో ఎంత సమయం పడితే అంత ఉండేందుకు అవకాశం లేదు. బిగ్ బాస్ ఇచ్చే కొన్ని టైమింగ్స్ ని బట్టే తీసుకోవాలి. తనూజ కెప్టెన్ కాబట్టి ఆమెకు 60 నిమిషాల సమయం టాస్క్ ఆడకుండానే తీసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.
అయితే మరోసారి తనూజ ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మీకు ఇచ్చిన సమయం సరిపోతుందా? , లేకపోతే మీ తోటి కంటెస్టెంట్స్ ని రిక్వెస్ట్ చేసుకొని కాస్త సమయం తీసుకుంటారా అని అడుగుతాడు బిగ్ బాస్. అందుకు తనూజ ఒప్పుకోదు, నాకు ఇచ్చిన సమయం సరిపోతుంది అని చెప్తుంది. కానీ ఇది మెయిన్ ఎపిసోడ్ లో కట్ చేశారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ని ‘నీకు నిజంగానే ఫ్యామిలీ హౌస్ లోకి రావాలని లేదా?’ అని అడుగుతుంది. నీకు అదనపు టైం కావాలా? , సరే తీసుకో అంటాడు. అప్పుడు తనూజ మూతి మీద వాత పెడతాను, నీకు ఉన్నదే 15 నిమిషాలు, వాడుకో దాన్ని అని అంటుంది. ఇక ఆ తర్వాత ఆమె హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ లోపల తనకు ఇచ్చిన ఆఫర్ గురించి చెప్తుంది. అంటే ఆడియన్స్ కి ఈమె పరోక్షంగా హౌస్ మేట్స్ ని టైం అడుగుతుంది అని అర్థం అయ్యేలా ఎడిట్ చేశారు. ఇది చూసిన తనూజ అభిమానులు , మరీ ఇంత అన్యాయమా అని సోషల్ మీడియా లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.