Nagarjuna Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని హీరో నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అలాగే ఆయనతో కాసేపు చర్చించారు. గతేడాది నవంబర్ లో అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం జైనబ్ రవ్జీ తో జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అధికారికంగా వివాహ తేదీ వెల్లడిచనప్పటికిీ జూన్ 6న ఈ వేడుక జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.