RCB Winning Prediction : బెంగళూరు జట్టుకు అద్భుతమైన మెరిట్ ఉంది. సూపర్ ఆటగాళ్లు ఉన్నారు. బెంగళూరు ఫైనల్ వెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో మూడుసార్లు చివరి అంచు దాకా వెళ్ళినప్పటికీ ట్రోఫీ అందుకోలేకపోయింది. చేసిన చిన్న చిన్న తప్పులు ఆ జట్టుకు మహా అవరోధంగా నిలిచాయి. దీంతో కప్పు దక్కించుకోవాలనే కలను బెంగళూరు జట్టు నెరవేర్చుకోలేకపోయింది. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా.. ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి గొప్పగా ఆడుతోంది కన్నడ జట్టు. విరాట్ కోహ్లీ, సాల్ట్ దుమ్ము రేపే విధంగా బ్యాటింగ్ చేస్తున్నారు. మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగం కూడా అత్యంత బలంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈసారి బెంగళూరు ఏదో మ్యాజిక్ చేసే విధంగా కనిపిస్తోంది.. ఇదే ధీమా బెంగళూరు అభిమానుల్లో విపరీతంగా ఉంది. దీనిని వారు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు.. పంజాబ్ జట్టును ఓడించి ఏ ముహూర్తాన అయితే బెంగళూరు ఫైనల్ వెళ్ళిపోయిందో.. ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధి అనేది లేకుండా పోయింది.
Also Read : అట్లుంటది బుమ్రా యార్కర్.. దెబ్బకు నేల మీద పడ్డ వాషింగ్టన్.. వైరల్ వీడియో
గత 17 సీజన్లుగా బెంగళూరు కప్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఫైనల్ వెళ్లిపోయిన నేపథ్యంలో రకరకాల కథనాలను బెంగళూరు అభిమానులు వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారు. అందులో ఒక స్టోరీ మాత్రం నమ్మే విధంగా ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ కీలకమైన బౌలర్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఇతడు అద్భుతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇతడు ఆడిన అన్ని ఫైనల్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. 2015, 2023 విశ్వకప్ చివరి అంచే పోటీలలో మ్యాచ్లలో ఇతడు కంగారు జట్టు తరఫున కీలకంగా వ్యవహరించాడు. అద్భుతంగా బౌలింగ్ వేసి వరల్డ్ కప్పులు సాధించే విధంగా చేశాడు. ఇక 2021 లో టి20 వరల్డ్ కప్, ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై జట్టు తరఫున అద్భుతం చేశాడు. ఫైనల్ మ్యాచ్లో సూపర్ బౌలింగ్ చేసి ధోని సేన విజేతగా నిలిచేలా చేసాడు. ఇక 2012లో సీఎల్ టీ 20, 2020లో బిబిఎల్ ఫైనల్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి.. తను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లను గెలిపించాడు. ఇప్పుడు బెంగళూరు జట్టు తరఫున అతడు ఫైనల్ ఆడుతున్న నేపథ్యంలో రజత్ పాటిదార్ సేన విజేతగా నిలుస్తుందని బెంగళూరు అభిమానులు జోస్యం చెబుతున్నారు. మొత్తంగా 17 సంవత్సరాల తర్వాత బెంగళూరు జట్టు సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సీజన్లో హేజిల్ వుడ్ బెంగళూరు జట్టు తరుపున అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.