Champions Trophy: ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయ్(Dubai)వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్ ఆడే దేశాలు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. 8 దేశాలు రెండు గ్రూపులగా టోర్నీలో తలపడతాయి. ఈమేరకు దాయాది దేశం పాకిస్తాన్(Pakistan)లో ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. ఇటీవలే గడాఫీ స్టేడియం సిద్ధం చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. శుక్రవారం(ఫిబ్రవరి 7న) తమ జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. అయితే ఈ జెర్సీని చూసిన అభిమానులు చివరకు జెర్సీ కూడా కాపీ కొట్టారా అని ఎగతాళి చేస్తున్నారు. ఈ జెర్సీ పాకిస్తాన్ కోసమా లేక ఐర్లాండ్ కోసమా అని ప్రశ్నిస్తున్నారు. స్వదేశంలో టైటిల్ గెలవాలని భావిస్తున్న పాకిస్తాన్ తాజాగా జెర్సీ విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది.
కొత్త జెర్సీలో ఆటగాళ్లు..
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ జట్టులోని 15 మంది ఆటగాళ్లు కొత్త జెర్సీ(New Jersy)లు ధరించి వేదికపై ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే కొంతమంది అభిమానులు పాక్ క్రికెట్ జట్టును ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇది పాకిస్తాన్ జట్టా.. లేక ఐర్లాండ్ జట్టా అని కామెంట్స్ పెట్టారు.
దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్‌లు..
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో పర్యటించేందుకు నిరాకరించిన టీమిండియా ఈ టోర్నీలో మ్యాచ్‌లు అన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది. పాకిస్తాన్–భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టీమిండియా పాకిస్తాన్‌లో ఆడేందుకు నిరాకరించింది. భద్రత సమస్యను కూడా ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మధ్యేమార్గంగా ఐసీసీ కొత్త వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసింది. లీగ్ దశలో భారత్ ఆడే మూడు మ్యాచ్‌లతోపాటు సెమీఫైనల్, ఫైనల్‌కు కూడా టీమిండియా చేరితే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే ఆడుతుంది.
Presenting Pakistan team’s official jersey for the ICC Champions Trophy 2025
Order now at https://t.co/TWU32Ta9wL #ChampionsTrophy | #WeHaveWeWill pic.twitter.com/iXZH4TVKqf
— Pakistan Cricket (@TheRealPCB) February 7, 2025