PAK vs BAN : సున్నాకి మించి నీకు చేతకాదు..పైగా విరాట్ కోహ్లీతో పోటీ అంటావ్.. నిన్ను జట్టులో ఎలా భరిస్తున్నారు బ్రో?

సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. కానీ అడవిలో చేసే గర్జనకు, నడి ఊర్లో అరిచే అరుపుకు తేడా ఉంటుంది. ఈ సూక్తి ఈ పాకిస్తాన్ క్రికెటర్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 22, 2024 10:48 am

Babar Azam Duckout

Follow us on

PAK vs BAN: రావల్పిండి వేదికగా పాకిస్తాన్ – బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ఆడటం మొదలుపెట్టాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురవడంతో నిర్వహణకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం 9;30 నిమిషాలకు మ్యాచ్ మొదలు కావాల్సి ఉండేది. వర్షం వల్ల మధ్యాహ్నం వరకు కూడా షురూ కాలేదు. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే అనుమానం మొదలైంది. ఆ తర్వాత మ్యాచ్ మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత ప్రారంభమైంది.. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి, 158 రన్స్ చేసింది.. మ్యాచ్ ప్రారంభంలోనే బంగ్లా బౌలర్లు పాకిస్తాన్ బ్యాటర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. తేమ, బౌన్సీ పిచ్ కావడంతో అద్భుతమైన బంతులు వేశారు. బుల్లెట్ లాగా బంతులు దూసుకురావడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు నిలబడలేకపోయారు. ఒకానొక దశలో 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పాకిస్తాన్, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సౌద్ షకీల్ (52*), నయీమ్ ఆయుబ్ (56) అర్థ శతకాలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 98 రన్స్ పార్టర్న్ షిప్ బిల్డ్ చేశారు. వీరిద్దరూ కనుక ఆడకపోయి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మరో విధంగా ఉండేది.

పాకిస్తాన్ జట్టు భారీ అంచనాలు పెట్టుకున్న బాబర్ అజామ్ (0) డక్ ఔట్ కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అజామ్ ఇస్లాం బౌలింగ్లో కీపర్ లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో పాకిస్తాన్ 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి అబ్దుల్లా షఫీకీ(2), షాన్ మసూద్(3) వెంట వెంటనే అవుట్ కావడంతో బాబర్ మైదానం లోకి వచ్చాడు. అతడు మెరుగైన బ్యాటింగ్ చేస్తాడని.. పాకిస్తాన్ జట్టును ఆదుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా అతడు డక్ అవుట్ అయ్యాడు. కొంతమంది నెటిజన్లు అతడు అవుట్ అయిన విధానాన్ని ట్రోల్ చేస్తున్నారు. “నీకు విరాట్ కోహ్లీ తో పోటీ ఏంటి? రెండు బంతులకే సున్నా చుట్టి వచ్చావు అంటూ దెప్పి పొడుస్తున్నారు. “సున్నా కి మించి నీకు చేతకాదు..పైగా విరాట్ కోహ్లీతో పోటీ అంటావ్.. నిన్ను జట్టులో ఎలా భరిస్తున్నారు బ్రో?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ, బాబర్ ఆట తీరును గేలి చేస్తున్నారు. ముందు సరిగ్గా ప్రాక్టీస్ చేసి.. అవుట్ కాకుండా ఆడి.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తో పోలిక పోల్చుకో అంటూ చురకలు అంటిస్తున్నారు.