https://oktelugu.com/

TATA Nano EV : TaTa నానొ కొత్త కారు.. మైలేజ్ మాములుగా లేదు.. అదిరిపోయే ఫీచర్స్ విశేషాలు ఇవి..

కార్ల కంనీలు సైతం ఈవీల ఉత్పత్తికే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆకర్షణీయమైన ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మరికొన్ని కంపెనీలు ఉత్పత్తి దశలో ఉన్నాయి. అయితే టాటా నుంచి ఇప్పటికే కొన్ని ఈవీలు మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే గతంలో నిలిచిపోయిన నానో కారును ఈవీగా మార్చి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 22, 2024 / 10:49 AM IST

    TATA Nano EV

    Follow us on

    TATA Nano EV :  సామాన్యులకు సైతం కారు ఉండాలనే ఉద్దేశంతో TaTa కంపెనీ అప్పట్లో వినూత్న నిర్ణయం తీసుకుంది. దీంతో రూ. లక్ష రూపాయలకే కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. 2008 జనవరి 10న దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు.మొదట్లో ఈ కారుపై ఆసక్తి ఉండి చాలా మంద కొనుగోలు చేశారు. కానీ దూర ప్రయాణాలకు అనుగుణంగా లేకపోవడంతో పాటు , మరికొన్ని కారణాల వల్ల ఈ కారు కొనుగోలుకు చాలా మంది వెనుకడుగు వేశారు. దీంతో 2018 లో ఇవి 88 యూనిట్స్ మాత్రమే సేల్స్ అయ్యాయి. దీంతో అదే సంవత్సరం ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే ఇదే పేరుతో ఒప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ ను అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కారుకు సంబంధించిన కొన్ని మోడల్స్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి. తాజాగా ఈ కారు గురించి ఫీచర్స్ బయటికి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ హవా సాగుతోంది. స్కూట్ నుంచి కార్ల వరకు అన్ని విద్యుత్ వాహనాలు ఉండేలా చూసుకుంటున్నారు. కార్ల కంనీలు సైతం ఈవీల ఉత్పత్తికే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆకర్షణీయమైన ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మరికొన్ని కంపెనీలు ఉత్పత్తి దశలో ఉన్నాయి. అయితే టాటా నుంచి ఇప్పటికే కొన్ని ఈవీలు మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే గతంలో నిలిచిపోయిన నానో కారును ఈవీగా మార్చి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే తాజాగా టాటా నానొ ఈవీ గురించి ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.

    కొన్ని వివరాల ప్రకారం.. టాటా నానో ఫీచర్స్ అదర హో అంటున్నారు. కొత్త నానొ 4 సీటర్ ను కలిగి ఉంది. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ అయినప్పటికీ పాత కారు కంటే ఇది విశాలమైన స్పేస్ ను కలిగి ఉంటుంది. ఇందులో 40 కిలో వాట్ లిథియా అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఈ బ్యాటరీ తో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 నుంచి 400 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారులో స్టీరింగ్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటివి అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి.

    కొత్త నానొ ఎలక్ట్రిక్ కారును రూ. 5 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత నానొను రూ. లక్ష తో విక్రయించారు. అయితే ఇది ఈవీ వేరియంట్ తో పాటు ఇప్పుడు మార్కెట్లో ఉన్న కార్లతో పోటీ పడే విధంగా టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో లో బడ్జెట్ లో బెస్ట్ ఈవీని కొనుగోలు చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. టాటా మోటార్స్ నుంచి ఇప్పటికే ఎస్ యూవీ ఈవీలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ మినీ ఈవీగా టాటా నానో ప్రత్యేకంగా నిలవనుంది. అన్నీ అనుకూలంగా ఉంటే ఈ ఏడాదిలోనే కొత్త ఈవీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనిని దక్కించుకునేందుకు కొందరు ఎదురుచూస్తున్నారు.