World Cup 2023: పాక్, అప్ఘన్ కు హ్యాండిచ్చినట్టే.. సెమీస్ పై పేలుతున్న ట్రోల్స్…

ఫుట్ బోర్డ్ దగ్గర ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన కమ్మిన్స్ నిలబడి ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ అయిన విలియమ్ సన్ బస్సులో ఎక్కుతున్నట్టుగా ఆ పిక్ లో ఉంది. ఇక విలియమ్ సన్ వెనకాల పాకిస్థాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్,అఫ్గాన్ కెప్టెన్ అయిన షాహిది ఉండి ఆశ్చర్యంగా చూస్తున్నారు.

Written By: Gopi, Updated On : November 11, 2023 3:25 pm

World Cup 2023

Follow us on

World Cup 2023: ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఇండియా వరుసగా ఎనిమిది విజయాలను అందుకొని ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేసింది.ఇక ఇప్పటికే ఇండియన్ టీమ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది కాబట్టి సెమీస్ లో ఇండియా తో పోటీ పడే టీం ఏది అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే సెమీ ఫైనల్ కి చేరుకున్న జట్టుగా న్యూజిలాండ్ టీమ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయి పోయింది.కాబట్టి ఇండియన్ టీం తో ఈనెల15వ తేదీన ముంబై వేదికగా ఫస్ట్ సెమి ఫైనల్ లో న్యూజిలాండ్ టీమ్ తలపడనుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు భారీ ఎత్తున ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఫైనల్ టూర్ అని ఉన్న బస్సును రోహిత్ శర్మ నడుపుతూ ఉంటే పక్కన భావుమా కూర్చుని ఉన్నాడు.ఫుట్ బోర్డ్ దగ్గర ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన కమ్మిన్స్ నిలబడి ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ అయిన విలియమ్ సన్ బస్సులో ఎక్కుతున్నట్టుగా ఆ పిక్ లో ఉంది. ఇక విలియమ్ సన్ వెనకాల పాకిస్థాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్,అఫ్గాన్ కెప్టెన్ అయిన షాహిది ఉండి ఆశ్చర్యంగా చూస్తున్నారు.ఇక ఆ పిక్ చూసిన చాలా మంది రోహిత్ శర్మ బాబర్ అజమ్ కి, షాహిది కి హ్యాండ్ ఇచ్చి న్యూజిలాండ్ కెప్టెన్ అయిన విలియమ్ సన్ ని బస్సు లో ఎక్కించుకున్నాడు అంటూ చాలామంది క్రికెట్ అభిమానులు ఫన్నీ వే లో కామెంట్లు చేస్తున్నారు…

ఇక ఇది ఇలా ఉంటే ఇండియా టీమ్12వ తేదీన నెదర్లాండ్స్ తో లీగ్ లో తన చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ గెలిచిన, ఓడిపోయిన పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి ఈ మ్యాచ్ లో మన ప్లేయర్లు రిలాక్స్ గా ఆడతబోున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా ఇండియా విజయాన్ని దక్కించు కుంటే వరుసగా తొమ్మిది విజయాలను అందుకున్న టీం గా ఇండియా చరిత్రలో నిలిచిపోతుంది.కాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి అయిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి చూపించాలని ఇండియన్ అభిమానులు తాపత్రయ పడుతున్నారు.

అయితే నెదర్లాండ్స్ టీమ్ ని తక్కువ అంచనా వేయలేం…ఇంతకు ముందు సౌతాఫ్రికా టీం కి భారీ జలక్ ఇచ్చింది. దాంతో ఆ టీంని తక్కువ అంచనా వేయకూడదనే ఉద్దేశ్యంలో ఇండియన్ ప్లేయర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ గాని, రోహిత్ శర్మ గాని సెంచరీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి…