Travis Head: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ పెను విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాడు. భారీ శతకం కొట్టి ఆస్ట్రేలియా కు తిరుగులేని ఆధిక్యాన్ని మాత్రమే కాదు, గెలిచేంత సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు.
బీభత్సమైన ఫామ్ లో ఉన్న హెడ్.. బ్రిస్బేన్ లోనూ అదే స్థాయిలో జోరు చూపించాలని భావిస్తున్నాడు. భారత బౌలర్లపై తిరుగులేని పరాక్రమాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నాడు. సిరీస్ ఆస్ట్రేలియా వశం చేయడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ సిద్ధం చేయాలని అనుకుంటున్నాడు. అయితే హెడ్ వేసుకుంటున్న అంచనాలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. టీమిండియాతో మ్యాచ్ అంటేనే అతడు వణికి పోతుండడమే దానికి కారణం అని తెలుస్తోంది.
వరుసగా సున్నాలు
గబ్బా టెస్ట్ అంటేనే హెడ్ భయపడి పోతున్నాడు. ఆస్ట్రేలియాలో ఏ మైదానంలో మ్యాచ్ జరిగినా హెడ్ అదరగొడతాడు. బ్యాట్ ను ఇష్టానుసారంగా తిప్పేస్తూ బౌలర్లను బాదేస్తుంటాడు. అయితే గబ్బాలో ఆడాలంటేనే హెడ్ వణికి పోతున్నాడు. గబ్బా మైదానంలో హెడ్ అనుకున్న స్థాయిలో ఇన్నింగ్స్ ఆటలేకపోయాడు. ఇక్కడ ఆడిన ఎక్కువ మ్యాచ్లలో తన సత్తా చూపించలేకపోయాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో ఈ వేదికపై ఆడిన ఇటీవల మ్యాచులలో హెడ్ సున్నా చుట్టాడు. వరుసగా మూడుసార్లు డక్ అవుట్ అయ్యాడు.. ఈ మూడు ఇన్నింగ్స్ లో ఎదుర్కొన్న తొలి బంతికే హెడ్ డక్ అవుట్ గా వెనుతిరగడం గమనార్హం. అందువల్లే ఈ మైదానంలో మ్యాచ్ అంటేనే హెడ్ కలత చెందుతున్నాడు.
సాధ్యమవుతుందా?
క్రికెట్లో కొన్ని మైదానాలు ఆటగాళ్లకు కొట్టినపిండి. ఆ మైదానాలలో తమ ఉత్తమమైన ఇన్నింగ్స్ ఆడాలని ఆటగాళ్లు అనుకుంటారు. ఇంకా కొన్ని మైదానాలు ఆటగాళ్లకు పెను సవాల్ విసురుతుంటాయి. ఆడాలంటేనే ఇబ్బంది పడేలా చేస్తాయి. అదృష్టం కలిసి రాకపోవడం వల్ల.. ఎంత బాగా ఆడాలని ప్రయత్నించినా విఫలమవుతుంటారు. అందువల్లే అలాంటి మైదానాలలో ఆడాలంటేనే ఆటగాళ్లు వెనకా ముందూ చూసుకుంటారు. ఇప్పుడు హెడ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ఇటీవల సిరాజ్ తో జరిగిన వివాదం వల్ల వార్తల్లో నిలిచాడు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో గబ్బా మైదానంలో హెడ్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.
కాచుకొని ఉన్న సిరాజ్
హెడ్ తో జరిగిన వివాదం నేపథ్యంలో భారత బౌలర్ సిరాజ్ కాచుకొని ఉన్నాడు. బ్రిస్బేన్ టెస్టు నేపథ్యంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. మైదానంలో కఠినంగా శ్రమించాడు. షార్ట్ పిచ్ బంతులను వేశాడు. ఈ మైదానంపై హెడ్ కు గొప్ప రికార్డు లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా హెడ్ ను అవుట్ చేయాలనే కసితో సిరాజ్ శ్రమించాడు. ఒకవేళ సిరాజ్ కనక హెడ్ ను అవుట్ చేస్తే తన ప్రతీకారాన్ని నెరవేర్చుకున్న వాడు అవుతాడు. అంతేకాదు హెడ్ పై పై చేయి సాధించిన టీమ్ ఇండియా బౌలర్ గా నిలుస్తాడు.