https://oktelugu.com/

Dharavi slum : ముంబాయి నగరానికి మాయని మచ్చ ధారవి మురికివాడకు మంచిరోజులు

Dharavi slum: ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశమైంది. బంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఈ ప్రాజెక్ట్ రద్దు చేస్తామని రాహుల్ ప్రకటించాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కూటమి గెలవకుండా బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు అడుగులు పడుతున్నాయి. ఫడ్నవీస్ సీఎం కావడంతో ధారవి ప్రాజెక్ట్ ముందుకెళుతుందన్న నమ్మకం కలుగుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 13, 2024 / 08:00 PM IST

    Dharavi slum :  ధారావి.. ఈ పేరు వినని వారు లేరు. ముంబై నగరానికి ఓ మాయని మచ్చ అనుకోండి.. అదీ నగరం నడిబొడ్డున.. ఏషియాలోకెల్ల అతిపెద్ద మురికివాడ..దీని మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. స్లమ్ డాగ్ మిలియనర్ అంటూ తీసిన ఈ సినిమాకు ఎన్నో ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఆరు వందల ఎకరాల్లో ఈ మురికివాడ ఉంది. 5 సెక్టార్లు.. 34 జోన్స్..ఇక్కడ 10 లక్షలకు పైగా మంది నివసిస్తున్నారు. చిన్న చిన్న రేకుల షెడ్లు ఉంటాయి. మానవ యోగ్యం కాని నివాసాలు. మనుషులు ఉండలేని పరిస్థితులున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ఉంటారు. చిన్నచిన్న కుటీర పరిశ్రమల నుంచి .. ఎలక్ట్రానిక్ పరిశ్రమల దాకా ఇక్కడ జీవిస్తున్నారు.దాని గురించి కథలు కథలుగా చెప్పాల్సిన పరిస్థితులున్నాయి. ఇది ముంబై గ్రోత్ ఇంజన్ గా దీన్ని చెబుతున్నారు. వీరి గురించి ఎవరూ ఆలోచించలేదు.

    2004లో వీరి బతుకులు మారాలని ఓ పునరావాస ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 20 ఏళ్లు అయినా ఇది ప్రారంభం కాలేదు. 2022లో చివరగా ఇది జరుగుతుందని ఆశ కలిగింది. ఈ బిడ్ అదానీకి వచ్చింది. అదానీ అయితేనే ఇది కట్టిస్తాడని నమ్మకం కలిగింది. 5వేల కోట్ల పైచిలుకు ఫస్ట్ ఫేస్ మొదలైంది. 80 శాతం అదానీది.. 20 శాతం రాష్ట్ర ప్రభుత్వానిదీ.. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 23,000 కోట్లు.. ఫస్ట్ ఫేజ్ 5వేల చిల్లర.. ఈసారి కూడా ఫెయిల్ అయిపోతుందని అనుకున్నారు.

    ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశమైంది. బంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఈ ప్రాజెక్ట్ రద్దు చేస్తామని రాహుల్ ప్రకటించాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కూటమి గెలవకుండా బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు అడుగులు పడుతున్నాయి. ఫడ్నవీస్ సీఎం కావడంతో ధారవి ప్రాజెక్ట్ ముందుకెళుతుందన్న నమ్మకం కలుగుతోంది.

    ముంబాయి నగరానికి మాయని మచ్చ ధారవి మురికివాడకు మంచిరోజులు రాబోతున్నాయి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.