Allu Arjun Arrested: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఇక దానికి అనుగుణంగా ఆయన మీద కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈరోజు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ రోజు నాంపల్లి కోర్టులో అతనికి బెయిల్ రాకపోయినప్పటికి హైకోర్టులో మాత్రం బెయిల్ అయితే వచ్చింది…ఇక ఇదిలా ఉంటే దీనిమీద నటుడు బ్రహ్మాజీ ఒక ఆసక్తికరమైన ట్వీట్ అయితే చేశాడు. తొక్కిసలాట లో జనం చనిపోతే కేసు అవుతుంది అనుకుంటే ఎన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభలు పెట్టినప్పుడు తొక్కేసలాట లో ఎంత మంది చనిపోలేదు. అలా అయితే దేశంలో ఉన్న సగం రాజకీయ నాయకులు జైల్లోనే ఉండాలి అంటూ ఆయన ఆసక్తికరమైన పోస్ట్ అయితే పెట్టాడు.
ఇక దీని మీద కొంతమంది అతని సమర్థిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం బ్రహ్మాజీ మాటలను విమర్శిస్తూన్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో స్పందించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీల్లో ఏ ఒక్కరు కూడా అరెస్టును నిరసిస్తూ ఒకరు కూడా స్పందించలేదు. కానీ బ్రహ్మాజీ మాత్రం డేర్ చేసి దీనిమీద స్పందించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా బ్రహ్మాజీకి అల్లు అర్జున్ కి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. కాబట్టే ఆయన ఇలా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ ఆయన మీద ఇలాంటి కేసులు అవ్వడం వల్ల ఆయన క్రేజ్ ను కోల్పోయే అవకాశం అయితే ఉంది.
మరి ఇకమీదట ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మంచిదని కొంతమంది అతన్ని హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తుంది… మరి ఏది ఏమైనా కూడా తాత్కాలికమైన బెల్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ కేసు ఎక్కడ దాకా వెళుతుంది అనేది తెలియాల్సి ఉంది.