ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023లో కీలక సమరాలకు వేదిక అవుతోంది. సెమీస్ వరకూ చేరిన వేళ ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ మన విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి ప్రధాన పోటీదారుగా దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఉన్నారు. ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్ మెంట్ ప్రకటించిన డికాక్.. తన సౌతాఫ్రికాకు ఇప్పటివరకూ అందనిద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ ను అందించడమే పరుగుల వరద పారిస్తున్నారు. ప్రస్తుతం సెమీస్ ముంగిట టాప్ 10 బ్యాటర్లు ఉన్నారు.
వరల్డ్ కప్ లో ఇప్పుడు సెమీస్ ముందర అత్యధిక పరుగుల వీరుడిగా విరాట్ కోహ్లీ ఉన్నారు. మొత్తం 594 పరుగులతో టాప్ లో ఉన్నాడు. 2వ స్థానంలో క్వింటన్ డికాక్ 591 పరుగులతో ఉన్నారు. వీరిద్దరికి మధ్య తేడా కేవలం 3 పరుగులే సెమీస్ , ఫైనల్ ఈ రెండు మ్యాచ్ లు మాత్రమే వీరిద్దరికి ఉన్నాయి. ముందు సెమీస్ లో గెలిస్తే వీరిద్దరిలో ఒకరు టాప్ గా నిలవడం ఖాయం.
ఇక 3వ స్థానంలో న్యూజిలాండర్ రచిన్ రవీంద్ర 565 పరుగులతో ఉన్నారు. ఈ యువ సంచలన వరల్డ్ కప్ లో సెంచరీల మోత మోగిస్తున్నాడు.ఇక 4వ స్థానంలో రోహిత్ శర్మ 503 పరుగులతో ఉన్నాడు. 6వ స్థానంలో డేవిడ్ వార్నర్ 499 పరుగులు, 7వ స్తానంలో వాండర్ డసెన్ 442 పరుగులు, 8వ స్థానంలో మిచెల్ మార్ష్ 426 పరుగులు, 9వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ 421 పరుగులు, 10వ స్థానంలో డారిల్ మిచెల్ 418 పరుగులతో.. 11వ స్థానంలో డేవిడ్ మలాన్ 404 పరుగులతో ఉన్నారు.
వీరందరిలోకి కోహ్లీ, డికాక్ లకు మాత్రమే అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. రచిన్ రవీంద్ర కూడా అవకాశాలున్నాయి.