https://oktelugu.com/

టోక్యో ఒలింపిక్స్: కుస్తీలో ‘రవి’ చేసిన అద్భుతం

భారత కుస్తీ వీరుడు రవికుమార్ దహియా టోక్యో ఒలింపిక్స్ లో అద్భుతమే చేశాడు. కఠినమైన ప్రత్యర్థిని తెలివిగా దెబ్బకొట్టి రెజ్లింగ్ ఫైనల్ కు చేరుకున్నాడు. రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరుకొని సత్తా చాటాడు. కనీసం ఇప్పుడు భారత్ కు ఒక రజతం పతకాన్ని రవి ఖాయం చేయడం విశేషం. 7-9 తేడాతో కజక్ స్థాన్ కుస్తీవీరుడు సనయెవ్ నురిస్లామ్ ను రవికుమార్ ఓడించాడు. తొలి రెండు మ్యాచులు ఈజీగా గెలిచిన రవికి సెమీస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 4, 2021 4:14 pm
    Follow us on

    భారత కుస్తీ వీరుడు రవికుమార్ దహియా టోక్యో ఒలింపిక్స్ లో అద్భుతమే చేశాడు. కఠినమైన ప్రత్యర్థిని తెలివిగా దెబ్బకొట్టి రెజ్లింగ్ ఫైనల్ కు చేరుకున్నాడు. రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరుకొని సత్తా చాటాడు. కనీసం ఇప్పుడు భారత్ కు ఒక రజతం పతకాన్ని రవి ఖాయం చేయడం విశేషం.

    7-9 తేడాతో కజక్ స్థాన్ కుస్తీవీరుడు సనయెవ్ నురిస్లామ్ ను రవికుమార్ ఓడించాడు. తొలి రెండు మ్యాచులు ఈజీగా గెలిచిన రవికి సెమీస్ లో పెను సవాల్ ఎదురైంది. నురిస్లామ్ మొత్తంగా ఆధిపత్యం చెలాయించాడు. తొలుత రిఫరీ నిర్ధేశించిన 30 సెకన్లలో రవి పాయింటు తేలకపోవడంతో ప్రత్యర్థి 1-0తో ఆధిక్యంలో వెళ్లాడు. అంతలోనే పుంజుకున్న రవి ప్రత్యర్థిని పడగొట్టి 2 పాయింట్లతో అదరగొట్టాడు.

    కీలకమైన చివరి రౌండ్ లో రవి గెలవడం కష్టమేననుకున్నారు. కానీ ప్రత్యర్థి గాయపడడంతో రవికి కలిసివచ్చింది. ఇదే అదునుగా అతడిని ఒడిసిపట్టిన రవి.. పూర్తిగా 30 సెకన్లపాటు లేవకుండా రింగులోనే అడ్డుకోగలిగారు. విక్టరీ బైఫాల్ పద్ధతిలో ఫైనల్ కు చేరుకున్నాడు. భారత్ కు స్వర్ణం లేదంటే రజత పతకాన్ని ఖాయం చేశాడు.

    భారత్ నుంచి రెజ్లింగ్ ఫైనల్ చేరిన రెండో ఆటగాడు రవికుమార్ కావడం విశేషం. అంతకుముందు సుశీల్ కుమార్ 2008 బీజింగ్ లో కాంస్యం గెలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరుకొని రజతం సాధించాడు. తొమ్మిదేళ్ల తర్వాత రవి మరోసారి పతకం సాధిస్తుండడం విశేషంగా మారింది.