ఇండస్ట్రీలో బండ్ల గణేష్ కి ఒక మార్క్ ఉంది. జూనియర్ ఆర్టిస్ట్ నుండి నిర్మాతగా ఎదిగిన నేర్పరి. ముఖ్యంగా హీరోలకు భజన చేయడమే తన జీవిత ఆశయంగా వ్యవహరిస్తుంటాడు బండ్ల గణేష్. మైక్ దొరికితే ఎదురుగా ఏ హీరో ఉంటే, ఆ హీరోని తోపు తురుము వీరుడు, శూరుడు అంటూ హడావుడి చేసే బండ్లని పోలి మరో జూనియర్ బండ్ల ఉంటే ఎలా ఉంటుంది ? వినడానికే ఆసక్తిగా ఉన్నా, అచ్చం బండ్లలానే ఓ కుర్రాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.
పైగా ఆ కుర్రాడిని పరిచయం చేసింది కూడా బండ్ల గణేషే. తాజాగా బండ్ల గణేశ్ తన ట్విటర్ ఖాతాలో.. తనలాగే ఉన్న ఒక అబ్బాయి ఫోటో పోస్ట్ చేశాడు. అరె.. సేమ్ బండ్ల గణేష్ లానే ఉన్నాడు. ఎవరు ఈ అబ్బాయి ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ తెగ డౌట్లు ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. అయితే, ఈ ఫోటో మరెవరిదో కాదు, బండ్ల గణేష్ పెద్ద కుమారుడు హితేష్ నాగన్ బండ్లది. హితేష్ తండ్రి పోలికలతో కనిపిస్తూ.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.
My elder son Hitesh Nagan bandla 🙌🏻 pic.twitter.com/RV3CvznC4F
— BANDLA GANESH. (@ganeshbandla) August 2, 2021
అచ్చుగుద్దినట్లు బండ్ల గణేష్ లా కనిపించడంతో.. హితేష్ సినిమాల్లో రాణించడం ఖాయం అని బండ్ల సన్నిహితులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇక హితేష్ ఫోటోని బండ్ల గణేష్ షేర్ చేస్తూ.. ‘ఇతను నా పెద్ద కొడుకు హితేష్ నాగన్ బండ్ల’.. అంటూ నెటిజన్స్‌కి సగర్వంగా పరిచయం చేస్తూ.. అదిరిపోయే ఫోటోను పోస్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. అయితే, బండ్ల ఫాలోవర్స్ కూడా ఈ ఫోటో బండ్ల గణేశ్ కుర్రాడిగా ఉన్నప్పుడు దిగిన ఫొటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘మీ అబ్బాయి అచ్చు మీ జిరాక్స్‌లా ఉన్నాడు. డిట్టో దిగాడు’ అంటూ ఆ ఫోటోను షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. పవన్ డేట్లు కూడా ఇచ్చాడు కాబట్టి.. కథను సెట్ చేసే పనిలో ఉన్నాడట. ఇక బండ్ల గణేష్.. తన కొడుకును కూడా సినినాల్లోకే తీసుకొస్తాను అంటూ ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.