ఈ సంవత్సరం ఇప్పటి వరకు భారత్ రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది. గతంలో 2012 లండన్ ఒలింపిక్ గేమ్స్ లో కూడా భారత్ ఆరు పతకాలు సాధించడం గమనార్హం ఆ తర్వాత జరిగిన రియో ఒలింపిక్స్ లో మన అథ్లెట్లు కొద్దిగా నిరాశ పరిచినప్పటికీ మాత్రం అదే స్ఫూర్తిని కొనసాగించి పథకాలు చేపట్టారు. కాబట్టి టోక్యోలో మన వారు ఆరు పతకాలు గెలిచి లండన రికార్డుని ప్రస్తుతానికి సమం చేశారు.
2012లో లండన్ మహా నగరం లో జరిగిన ఒలింపిక్స్లో కూడా భారత జట్టు ఇలాగే రెండు రజతాలు నాలుగు కాంస్యాలతో సత్తా చాటింది. అంతకుముందు జరిగిన బీజింగ్ ఒలింపిక్స్లో భారత షూటర్ అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణపతకం సాధించి వ్యక్తిగత విభాగంలో తొలిసారి స్వర్ణం సాధించిన భారతీయ క్రీడాకారుడిగా రికార్డు సాధించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మరొకసారి వ్యక్తిగత విభాగంలో… అది కూడా అథ్లెటిక్స్లో భారత్ సాధించే అవకాశం కనపడుతోంది. భారత్ కి చెందిన నీరజ్ చోప్రా ప్రస్తుతం జావెలీన్ త్రో ఫైనల్స్ లో అందరికంటే ముందు ఉన్నాడు. ఒకవేళ అతను ఇప్పుడు నెలకొల్పిన దూరాన్నిఎవరూ అధిగమించి లేకపోతే అతను స్వర్ణం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇకపోతే ఇప్పటికీ లండన్ ఒలింపిక్స్ లో, టోక్యో ఒలింపిక్స్ లో ఒకే నెంబర్ పతకాలు భారత్ సాధించినప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2012 లండన్ ఒలింపిక్స్ విషయానికి వస్తే షూటింగ్లో విజయకుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం సాధించారు. రెజ్లింగ్ లో సుశీల్ కుమార్ రజతం సాధించగా… యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. బాక్సింగ్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కాంస్య పతకం సాధించింది. అలాగే బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించి తొలిసారి ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గా నిలిచింది.