హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలను మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ప్రతిష్టగా తీసుకుని అహర్నిషలు ఈటల రాజేందర్ ను ఓడించాలనే తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో నియోజకవర్గమే కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ అధినేత కేసీఆర్ మెప్పు కోసం శ్రమిస్తున్నారు. దీంతో బీజేపీ సైతం గంగుల కమలాకర్ ను టార్గెట్ చేసుకుని రాజకీయంగా దెబ్బతీయాలని భావిస్తోంది.
ఇందులో భాగంగానే ఆయన వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న గ్రానైట్ వ్యాపారంపై నిఘా పెట్టింది. ఫ్రభుత్వానికి ఎంత మేర పన్నులు ఎగవేస్తున్నారనే విషయాలు గ్రహించింది. అక్రమాలపై విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, మరి కొందరు ఫిర్యాదు చేయడంతో ఈడీ, సీబీఐ ఉమ్మడిగా దర్యాప్తు చేయడంతో నిజాలు వెలుగు చూశాయి.
ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్న మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన సంస్థలు శ్వేత గ్రానైట్ కంపెనీలైన శ్వేతా ఎంటర్ ప్రైజెస్, శ్వేతా కంపెనీలపై మచిలీపట్నం, తమిళనాడు రేవుల వద్ద విచారణ చేపట్టగా శ్వేత కంపెనీ ఎగుమతి చేస్తున్న గ్రానైట్ పరిమాణాలపై ఓ అంచనాకు వచ్చారు. దాని ప్రకారం పన్ను కడుతున్నారా లేదా అని ఆరా తీయగా కేవలం రూ.124 కోట్లు మాత్రమే చెల్లించి మిగతా సొమ్మును ఎగవేసినట్లు తెలిసింది.
దీంతో రంగంలోకి దిగిన ఈడీ మంత్రికి చెందిన సంస్థలు, మిగతా గ్రానైట్ కంపెనీ తీరుపై ఆరా తీయగా ఆసక్తి కర విషయాలు వెలుగు చూశాయి. ప్రభుత్వానికి రూ.750 కోట్ల మేర పన్నులు ఎగవేసినట్లు నిర్ధారించారు ఇందులో గ్రానైట్ సంస్థలు రూ.750 కోట్ల మేర ఎగవేసినట్లు గుర్తించారు. దీంతో రాజకీయంగా మంత్రి మెడకు గ్రానైట్ బండలు చుట్టుకున్నట్లు చెబుతున్నారు. శ్వేతా గ్రానైట్ కంపెనీకి రూ.360 కోట్లు పెనాల్టీ వేయడం చర్చనీయాంశం అయింది.