https://oktelugu.com/

ఒలింపిక్స్ లో పీవీ సింధు సంచలనం

టోక్యో ఒలింపిక్స్ లో తెలుగుతేజం పీవీ సింధు హవా కొనసాగుతోంది. వరుస విజయంతో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. రెండో మెడల్ కు చేరవయింది. మహిళల సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఆరో సీడ్ సింధు 21-13, 22-20తో నాలుగో సీడ్, జపాన్ స్టార్ అకానె యమగుచిని వరుస గేముల్లో ఓడించింది. 56 నిమిషాల్లో ముగిసిన ఈ ఆటలో ఆధిపత్యం చూపించింది. ఆట ప్రారంభంలో కొంచెం వెనుకంజ వేసినా తరువాత పుంజుకుని తన నైపుణ్యంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 30, 2021 / 06:13 PM IST
    Follow us on

    టోక్యో ఒలింపిక్స్ లో తెలుగుతేజం పీవీ సింధు హవా కొనసాగుతోంది. వరుస విజయంతో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. రెండో మెడల్ కు చేరవయింది. మహిళల సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఆరో సీడ్ సింధు 21-13, 22-20తో నాలుగో సీడ్, జపాన్ స్టార్ అకానె యమగుచిని వరుస గేముల్లో ఓడించింది. 56 నిమిషాల్లో ముగిసిన ఈ ఆటలో ఆధిపత్యం చూపించింది. ఆట ప్రారంభంలో కొంచెం వెనుకంజ వేసినా తరువాత పుంజుకుని తన నైపుణ్యంతో ప్రత్యర్థిని మట్టికరిపించింది.

    మొదట వెనుకంజ వేసినా తరువాత కళ్లు చెదిరే ఓ స్మాష్ తో ఆధిక్యాన్ని అందుకుంది. తరువాత అదే జోరు కొనసాగించి లీడ్ ను 11-7కు పెంచుకుంది. విరామం అనంతరం సింధు జోరు కనబరచగా యమగూచి సైతం దీటుగా బదులిచ్చింది. వరుస షాట్లతో దూసుకెళ్లిన సింధు 18-11తో ఆధిక్యం సాధించింది. తరువాత యమగూచి రెండు పాయింట్లు సాధించినా సింధు 21-13 గేమ్ ను 23 నిమిషాల్లో ముగించింది.

    సెకండ్ గేమ్ లో ఇద్దరు హోరాహోరీగా తలపడినా సర్వీస్ అందుకున్న సింధు 5-3తో లీడ్ సాధించింది. అనంతరం సింధు జోరు కనబర్చగా యమగూచి అనవసర తప్పిదాలతో 10-5తో వెనకబడిపోయింది. అదే జోరులో మరో నాలుగు పాయింట్లు సాధించి 14-8 లీడ్ లో నిలిచింది. కానీ తరువాత జోరు పెంచిన యమగూచి సింధు చేసిన తప్పిదాలను క్యాచ్ చేసుకుంటూ వరుస పాయింట్లతో స్కోర్లు 16-16తో సమం చేసింది.

    అనంతరం ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో స్కోర్లు 20-20తో సమంగా నిలిచారు. కానీ చివర్లో రెండు పాయింట్లు కొట్టిన సింధు 22-20 తో ఆటతో పాటు మ్యాచ్ ను సొంతం చేసుకుని సెమీఫైనల్ దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన సింధు టోక్యోలో మరొకటి గెలిస్తే ఓ మెడల్ సొంతం చేసుకోనుంది. తాజా విజయంతో యమగూచిత ఉన్న ముఖాముఖి పోరును సింధు 12-18తో మెరుగుపరుచుకుంది.