Homeఎంటర్టైన్మెంట్జగన్ కి సెల్యూట్‌ చేస్తున్న 'పీపుల్ స్టార్' !

జగన్ కి సెల్యూట్‌ చేస్తున్న ‘పీపుల్ స్టార్’ !

R Narayanamurthyసినిమా టికెట్ రేటు ఒకటి ఉంటుంది. కానీ, పెద్ద సినిమాల రిలీజ్ రోజు మాత్రం ఆ రేటు ఏ రేంజ్ కి వెళ్తుందో ఎవరికీ తెలియదు. బ్లాక్ టికెట్స్ కి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది సినిమా ఫస్ట్ షోకి. అయితే పెద్ద సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా జగన్ కొత్త జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం పై తానూ సెల్యూట్‌ చేస్తున్నాను అంటూ పీపుల్ స్టార్ ఆర్‌.నారాయణమూర్తి స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది చిన్న నటీనటులు నటించిన సినిమాలకు, అలాగే చిన్న సినిమాల నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని.. జగన్ గారు ప్రవేశ పెట్టిన ఈ జీవో మాకు ఆశాకిరణంగా ఉందని చెప్పుకొచ్చాడు.

తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించాడు ఆర్‌.నారాయణమూర్తి. ఈ సందర్భంగా తాను నిర్మిస్తున్న ‘రైతన్న’ సినిమా విశేషాలను అక్కడి ప్రజలతో పంచుకుంటూ పై కామెంట్స్ చేశారు. సినీ దర్శకుడిగా, నటు డిగా నారాయణమూర్తికి మంచి పేరు ఉంది. అలాగే సినిమా పరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

అందరితో మంచిగా ఉండే నారాయణమూర్తి ఇలా మాట్లాడటం చాలా మందికి నచ్చదు అయినా నారాయణమూర్తి మాత్రం పలు ఆరోపణలు చేస్తూ.. నేడు చిత్ర పరిశ్రమ మొత్తం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాను నటించి నిర్మించిన రైతన్న చిత్రం ఆగస్టు 15న విడుదలవుతుందని నారాయణమూర్తి తెలిపారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version