Suryakumar Yadav Catch: సూర్యకుమార్ క్యాచ్ పై వివాదం.. వెలుగులోకి మరో వీడియో..

టీమిండియా ఫైనల్ మ్యాచ్లో సాధించిన విజయంలో బ్యాట్ తో విరాట్ కోహ్లీ (76 పరుగులు), బౌలింగ్లో హార్దిక్ పాండ్యా (మూడు వికెట్లు), ఫీల్డింగ్లో సూర్య కుమార్ యాదవ్ (మిల్లర్ రిలే క్యాచ్) ఆకట్టుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 5, 2024 5:03 pm

Suryakumar Yadav Catch

Follow us on

Suryakumar Yadav Catch: టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 17 సంవత్సరాల తర్వాత పొట్టి ప్రపంచ కప్ ను దక్కించుకున్న విషయం విధితమే. ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్ తొలి బంతిని దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ బలంగా కొట్టాడు. దీంతో ఆ బంతి గాల్లోకి లేచింది.. సరిగ్గా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్య కుమార్ యాదవ్.. ఆ బంతిని అద్భుతంగా అందుకున్నాడు.. రిలే క్యాచ్ లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ బంతి బౌండరీ లైన్ అవతల పడుతుందని అందరూ అనుకుంటుండగా.. అనూహ్యంగా సూర్య కుమార్ యాదవ్ పట్టుకున్నాడు ఆ తర్వాత బంతిని మైదానంలోకి విసిరి.. బౌండరీ లైన్ నుంచి ఒక్కసారిగా జంప్ చేసి మరలా క్యాచ్ అందుకున్నాడు. దీంతో డేవిడ్ మిల్లర్ నిరాశతో వెనుతిరిగాడు. ఆ తర్వాత మరో అద్భుతమైన బంతికి వికెట్ పడగొట్టిన హార్దిక్ పాండ్యా.. ఆ ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టీమ్ ఇండియా మరోసారి t20 వరల్డ్ కప్ విజేత అయింది.

టీమిండియా ఫైనల్ మ్యాచ్లో సాధించిన విజయంలో బ్యాట్ తో విరాట్ కోహ్లీ (76 పరుగులు), బౌలింగ్లో హార్దిక్ పాండ్యా (మూడు వికెట్లు), ఫీల్డింగ్లో సూర్య కుమార్ యాదవ్ (మిల్లర్ రిలే క్యాచ్) ఆకట్టుకున్నారు. అయితే మ్యాచ్ హోరాహోరీగా మారిన నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా విజయ సమీకరణం 6 బంతుల్లో 16 పరుగులకు చేరుకున్న సమయంలో.. సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని ఒకసారిగా మార్చేసింది. అప్పటిదాకా గెలుపు పై అసలు పెంచుకున్న దక్షిణాఫ్రికాను కన్నీటి పర్యంతం చేసింది. అయితే ఈ క్యాచ్ ను దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వివాదాస్పదం చేశారు. సూర్య కుమార్ యాదవ్ బౌండరీ లైన్ తగిలాడని.. అ క్యాచ్ సరికాదని.. అంపైర్లు భారత జట్టుకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శలు చేసినట్టు వార్తలు వచ్చాయి.

దక్షిణాఫ్రికా ఆటగాళ్ల విమర్శల నేపథ్యంలో టీమిండియా అనుకూల నెటిజన్లు స్పందించారు. సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అయిందని పేర్కొన్నారు. అతడు అతడు బౌండరీ లైన్ ను అసలు తాకలేదని.. బౌండరీ లైన్ కు దూరంలోనే క్యాచ్ అందుకున్నాడని వివరించారు. వాటిని నిరూపిస్తూ సోషల్ మీడియాలో చాలా క్లోజప్ తో తీసిన వీడియోను పోస్ట్ చేశారు. ” టీమిండియా విజయం సాధిస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అలాంటివారు ఈ వీడియో చూడాలి. ఒకవేళ వీడియో స్పష్టంగా కనిపించకపోతే కళ్ళకు కాటారాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి. అప్పుడు కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కూడా పారదర్శకంగా దర్శనమిస్తుందని” నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.