https://oktelugu.com/

Rohit Sharma: ముంబై స్టేడియంలో.. రోహిత్ కు అరుదైన గౌరవం..

బిసిసిఐ నిర్వహించిన సన్మాన సభలో రోహిత్ పాల్గొన్నాడు.. ఈ సందర్భంగా టి20 వరల్డ్ కప్ లో జట్టుతో ప్రయాణాన్ని.. తనకు మిగిలిన అనుభూతులను పంచుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 5, 2024 / 04:58 PM IST

    Rohit Sharma

    Follow us on

    Rohit Sharma: టీమిండియాకు 17 సంవత్సరాల తర్వాత టి20 వరల్డ్ కప్ అందించిన ఘనతను కెప్టెన్ రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్లు కపిల్ దేవ్, ధోని సరసన చేరాడు. టి20 వరల్డ్ కప్ సాధించిన అనంతరం గురువారం నిర్వహించిన విక్టరీ పరేడ్ లో ట్రోఫీ ని చూపిస్తూ అభిమానులను అలరించాడు రోహిత్. ముంబై వాంఖడె స్టేడియంలో జరిగిన అభినందన సభలో రోహిత్ నామస్మరణ చేస్తూ.. అభిమానులు బాహుబలి -1 సినిమాను గుర్తు చేశారు. ఈ సందర్భంగా అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ రోహిత్ మైదానంలో విరాట్ కోహ్లీతో కలిసి స్టెప్పులు వేశాడు. తన స్టార్ డం మర్చిపోయి డాన్స్ చేశాడు.

    అనంతరం బిసిసిఐ నిర్వహించిన సన్మాన సభలో రోహిత్ పాల్గొన్నాడు.. ఈ సందర్భంగా టి20 వరల్డ్ కప్ లో జట్టుతో ప్రయాణాన్ని.. తనకు మిగిలిన అనుభూతులను పంచుకున్నాడు. ” ఈ విజయం గొప్పగా అనిపిస్తోంది. టి20 వరల్డ్ కప్ చేతిలో పడగానే ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది. ఈ విజయం మాలో ఉన్న నిరాశ నిస్పృహలను పూర్తిగా తొలగించింది. ఇక్కడిదాకా రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంతమంది అభిమానాన్ని పొందడం గర్వంగా అనిపిస్తోంది. పూర్వజన్మలో ఏదో అదృష్టం చేసుకుంటే ఈ స్థాయి సంతోషం లభిస్తోంది. మీ అందరి ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. మమ్మల్ని అభినందించి, సన్మానించిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలని” రోహిత్ శర్మ తన ప్రసంగంలో పేర్కొన్నాడు.

    అయితే రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ముంబైలోని వాంఖడె స్టేడియం నిర్వాహకులు అరుదైన గౌరవాన్ని అందించారు. వాంఖడె మైదానం లో ఒక స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. దానికి రోహిత్ శర్మ స్టాండ్ అని నామకరణం చేశారు. గతంలో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, సారవ్ గంగూలీ వంటి ఆటగాళ్లకు ఈ స్థాయిలో గౌరవం దక్కింది. ఇప్పుడు వారి తర్వాత ఆ స్థాయిలో ఘనతను రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు.. ఇదే విషయాన్ని వాంఖడె మైదానం నిర్వాహకులు ట్విట్టర్లో పేర్కొన్నారు.