https://oktelugu.com/

Singham Again: సింగం ఎగైన్ కోసం భారీగా కష్టపడుతున్న స్టార్ హీరో…

Singham Again: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఆడిందే ఆట పాడిందే పాట అయింది. ఎందుకంటే వాళ్లకు అడ్డు ఎవరు లేరు. వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారు.

Written By: , Updated On : July 5, 2024 / 05:13 PM IST
Star hero working hard for Singham Again

Star hero working hard for Singham Again

Follow us on

Singham Again: గత కొన్ని సంవత్సరాల నుంచి సౌత్ సినిమాల డామినేషన్ ను తట్టుకోలేకపోతున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటికి కూడా కోలుకోలేక పోతుంది. అక్కడి హీరోలు ఏ సినిమాలు చేసినా కూడా వచ్చినవి వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి తప్ప ఒక్క సినిమా కూడా భారీ సక్సెస్ ను అయితే సాధించలేకపోతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కడి హీరోలందరూ విచిత్రమైన కథలను ఎంచుకోవడమే కాకుండా సినిమా కోసం ఎంతలా అయినా కష్టపడి సినిమాని సక్సెస్ చేసుకోవాలనే రీతిలో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక మొన్నటిదాకా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఆడిందే ఆట పాడిందే పాట అయింది. ఎందుకంటే వాళ్లకు అడ్డు ఎవరు లేరు. వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారు.ఇక మమ్మల్ని మించిన వాళ్లు ఎవరూ లేరు అనే ఒక అహంకారంతో ఉండేవారు. కానీ ఇప్పుడు అదంతా పోయింది. ఒక్క సినిమా సక్సెస్ పడితే చాలు అనుకునే రోజుల్లోకి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క హిట్టయితే పడాల్సిన అవసరం ఉంది. ఇక అందులో భాగంగానే రోహిత్ శెట్టి డైరెక్షన్ లో అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న ‘సింగం ఎగైన్’ అనే సినిమా కోసం అజయ్ దేవగన్ విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.

కొన్ని సీన్స్ లో ఆయన డూప్ లేకుండానే నటిస్తూ సినిమా అవుట్ బాగా వచ్చే విధంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది… బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న హీరోలకి ఇప్పుడు హిట్ వాల్యూ ఏంటో తెలిసింది. ఒకప్పుడు వాళ్ళకి వరుసగా హిట్లు వస్తుంటే హిట్ వాల్యూ అనేది తెలిసేది కాదు. ఎంత పెద్ద డైరెక్టర్ అయిన ప్రొడ్యూసర్ అయిన మన దగ్గరికే రావాలి అనుకునేవారు. వాళ్ళ సినిమాలు హిట్ అయిన, ప్లాప్ అయిన పెద్ద ప్రాబ్లం ఏమి లేదు అని అనుకునే వాళ్ళు…

కానీ ఇప్పుడు వరుస సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల వాళ్ళ మార్కెట్ పూర్తిగా డౌన్ అవ్వడమే కాకుండా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆల్టర్నేట్ హీరోలను వెతుక్కునే పనిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్లు మరొకసారి వాళ్ళ స్టామినా చూపించుకోకపోతే మాత్రం ఇక వాళ్లందరూ షెడ్డు కెళ్ళి పోవాల్సి వస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది…