IPL Megha Auction 2025: నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా జట్ల యాజమాన్యాలు 18, 14, 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నాలుగు, ఐదో ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలనుకుంటే 18, 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అనామక ఆటగాడిని అంటి పెట్టుకోవాలనుకుంటే మాత్రం కచ్చితంగా నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక జట్ల యాజమాన్యాలు రిటైన్ జాబితాను దాదాపుగా ఖరారు చేశాయి. కొన్ని జట్ల అయితే ఏకంగా కెప్టెన్లకు ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే వేలంలోకి ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు వచ్చే అవకాశం కల్పిస్తోంది. 2025 వేలంలోనూ స్టార్ ఆటగాళ్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే కొందరు యువ ఆటగాళ్లపై మాత్రం ఈసారి కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. స్టార్ ఆటగాళ్లకు పోటీ ఇచ్చే యువ ఆటగాళ్లకు ఈసారి ఆయా జట్లు భారీగా ధర చెల్లించే అవకాశం కల్పిస్తోంది. రిటైన్డ్ జాబితాలో లేని ఆటగాళ్లకు ఈసారి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరంటే..
రసిక్ దర్
ఢిల్లీ జట్టులో బౌలర్ గా ఉన్న ఈ యువ ఆటగాడు ఈసారి వేలంలో ఉంటాడని తెలుస్తోంది. కీలక జట్లు కూడా ఇతడిపై దృష్టి సారించాయి. చివరి ఓవర్లు వేయడంలో ఇతడు ప్రసిద్ధి చెందాడు. ఇటీవల జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో ఈ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ లో 11 మ్యాచ్ లు ఆడి.. 9 వికెట్లు పడగొట్టాడు. ఇతడికి ఆడిన అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ.. నైపుణ్యం విషయంలో వంక పెట్టడానికి లేదు.
తుషార్ దేశ్ పాండే
2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఇతడు ఎంట్రీ ఇచ్చాడు. 2022లో ఇతడిని చెన్నై జట్టు 20 లక్షల కు సొంతం చేసుకుంది. 2023లో ఏకంగా 21 వికెట్లు సాధించాడు. గత సీజన్లో 17 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లే, స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. బ్యాట్ తో కూడా విన్యాసం చేస్తాడు. ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంటర్ ఇచ్చాడు. దీంతో చెన్నై జట్టు ఇతడిని ప్రత్యక్షంగా రిటైన్ చేసుకోవాలని భావించడం లేదు. దీంతో ఇతడికి వేలంలో భారీగా ధర దక్కే అవకాశం కనిపిస్తోంది.
సాయి కిషోర్
గుజరాత్ జట్టు చెందిన ఈ ఆటగాడిని 2022 మెగా వేలంలో మూడు కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ సీజన్లో ఇతడు భారీగా ధర పలికే అవకాశం కనిపిస్తోంది. ఇతడు ఎడమ చేతి వాటంతో స్పిన్ బౌలింగ్ వేస్తాడు. ఐపీఎల్ లో అది మ్యాచ్ లు మాత్రమే ఆడినప్పటికీ 13 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇతడి బౌలింగ్లో పెద్ద పెద్ద బ్యాటర్లు సైతం పరుగులు చేయకుండా చూస్తూ ఉండిపోయిన దృశ్యాలు చాలా ఉన్నాయి.
రమణ్ దీప్ సింగ్
ఇతడిని చేసుకునేందుకు కోల్ కతా జట్టు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రధాన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని ఉద్దేశంతో ఇతడిని బయటికి విడుదల చేస్తోంది. ఈ క్రమంలో అతడు భారీగా ధర దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో రమణ్ దీప్ సింగ్ అద్భుతంగా రాణించగలడు. విధ్వంసకరమైన ఆటగాడిగా ఇతడికి పేరుంది.