https://oktelugu.com/

Nara Lokesh  : చిన్న బాబు వెంట స్ట్రాంగ్ టీం.. కొత్త జనరేషన్ తో టిడిపి

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్లను పక్కన పెట్టింది. జూనియర్లకు పెద్దపీట వేసింది. అయితే ఇందులో లోకేష్ మార్క్ ఉంది. అందుకే సీనియర్లు సైతం చిన్న బాబును ఆశ్రయిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 30, 2024 / 02:37 PM IST

    Nara Lokesh 

    Follow us on

    Nara Lokesh  :  ఏపీ మంత్రి నారా లోకేష్ దూసుకుపోతున్నారు.మంత్రిగా కీలక బాధ్యతలు పోషిస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీని సైతం సమన్వయం చేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు.తరచు బిజెపి అగ్ర నేతలను కలుస్తున్నారు.వారి విలువైన సలహాలు సూచనలు తీసుకుంటున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప పనితీరును కనబరుస్తున్నారు మంత్రి లోకేష్.అయితే ఎవరైతే లోకేష్ ను తూలనాడారో.. తక్కువగా అంచనా వేసారో.. వారే ఇప్పుడు లోకేష్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఎన్నికల వరకు లోకేష్ ఒక ఫెయిల్యూర్ నేత. ఎన్ని రకాల ప్రచారం చేయాలో అన్ని రకాలుగా చేశారు. చివరకు వ్యక్తిగత హననానికి కూడా దిగారు. ఆయన బాడీ షెమింగ్ పై మాట్లాడారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆయన మాటలను సైతం వక్రీకరించి ప్రచారం చేశారు. కానీ అన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు నారా లోకేష్. సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీకి జవసత్వాలు నింపారు. పార్టీని విజయ తీరానికి చేర్చారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంది లోకేష్ వ్యవహార శైలి. భావి రాజకీయాలపై దృష్టి పెట్టారు లోకేష్. అందుకే తన సొంత టీమును ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు.

    * గతానికి భిన్నంగా క్యాబినెట్
    గతానికి భిన్నంగా ఈసారి మంత్రివర్గ కూర్పు సాగింది. చంద్రబాబు తన క్యాబినెట్లో జూనియర్లను ఎక్కువగా తీసుకున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పదిమందికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. అయితే అదంతా లోకేష్ కోసమేనని తెలుస్తోంది. ఇలా మంత్రి పదవులు దక్కించుకున్న వారంతా లోకేష్ సిఫారసులతో ఎమ్మెల్యే టికెట్లు పొందినవారే. అందుకే పార్టీలో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. లోకేష్ టీం తో తమ వారసులను పంపిస్తున్నారు సీనియర్లు. వచ్చే ఎన్నికల్లో వారసులను బరిలో దించి లోకేష్ టీంలో పని చేయించాలని భావిస్తున్నారు.

    * వారంతా లోకేష్ తోనే
    ఇప్పటికే ఏపీలో టీడీపీ సీనియర్ల వారసులు లోకేష్ ను అనుసరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు ఇప్పటికే లోకేష్ టీం లో ఉన్నారు. సోషల్ మీడియా విభాగాన్ని చూస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు సైతం ఇప్పుడు లోకేష్ ఫాలోవర్ గా మారారు. వచ్చే ఎన్నికల్లో భీమిలి స్థానం నుంచి తన కుమారుడితో పోటీ చేయించాలని గంటా భావిస్తున్నారు. అందుకే లోకేష్ తో టచ్ లోకి పంపుతున్నారు. విశాఖకు చెందిన మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు సైతం లోకేష్ ను ఫాలో అవుతున్నారు. వీరే కాదు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న సీనియర్ల వారసులు లోకేష్ వెంట నడుస్తుండడం విశేషం.