https://oktelugu.com/

Neeraj Chopra : దేశ ఖ్యాతిని పెంచడానికి ఈసారి నీరజ్ వచ్చాడు…ఏకంగా ప్రపంచ నంబర్ వన్ అయిపోయాడు

ఆ గెలుపు గాలివాటం కాదని నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఏ భారతీయుడికి సాధ్యం రికార్డులు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో టాప్ సెలబ్రిటీగా నిలిచాడు.

Written By:
  • Rocky
  • , Updated On : May 23, 2023 11:51 am
    Follow us on

    Neeraj Chopra : 2021లో జరిగిన ఒలంపిక్ పోటీల్లో భారతదేశానికి “బంగారు ఈటె” అందించిన నీరజ్ చోప్రా.. ఈసారి అంతకుమించి అనేలాగా అరుదైన ఘనత సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో లో ప్రపంచ నెంబర్ వన్ సాధించాడు. గ్రెనడా కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్(1433 పాయింట్లు) ను నీరజ్ చోప్రా (1455) వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. టోక్యో ఒలంపిక్స్ రజత పతక విజేత జాకబ్( చెక్ రిపబ్లిక్, 1,416) మూడో ర్యాంకులో నిలిచాడు. గత ఏడాది ఆగస్టు 30న రెండవ ర్యాంకు దక్కించుకున్న చోప్రా తన అద్భుత ప్రదర్శనతో కెరియర్లో తొలిసారి అగ్రస్థానానికి ఎగబాకాడు.

    భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో..
    నీరజ్ చోప్రా భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ లలో టాప్ ర్యాంక్ చేజిక్కించుకున్న తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అన్నట్టు నీరజ్ చోప్రా వయసు ఐదు సంవత్సరాలు మాత్రమే. ఈ సీజన్ డైమండ్ లీగ్ లో భాగంగా ఈనెల 6న దోహాలో జరిగిన తొలి అంచె పోటీల్లో నీరజ్ పసిడి పతకం సాధించాడు. 2021 లో జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ మెగా ఈవెంట్లో జావెలిన్ ను 87.58 మీటర్లు దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు.. భారతదేశానికి టోక్యో ఒలంపిక్స్ లో తొలి బంగారు పతకం తెచ్చిపెట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
    ఇక ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించిన తర్వాత ఆ ఫామ్ ను నీరజ్ చోప్రా కొనసాగిస్తున్నాడు. తన లాంటి అథ్లెట్ లను తయారు చేసేందుకు శిక్షణ ఇస్తున్నాడు. ఇటీవల ఉమెన్స్ అండర్ 19 t20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు కూడా భారత మహిళా క్రికెటర్లకు శిక్షణ ఇచ్చాడు. ఏకంగా దక్షిణాఫ్రికా వెళ్లి వారిని ఉత్సాహపరిచాడు. ఆటలో ఎటువంటి ఎటాకింగ్ ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్టుపై విజయం సాధిస్తామో వారికి అర్థమయ్యేలా వివరించాడు. మైదానంలో వారితో కఠోరమైన సాధన చేయించాడు. ఇక మొన్నటికి మొన్న ఉమెన్స్ టి20 ఐపిఎల్ సిరీస్ లో బెంగళూరు జట్టుకు  పలు విషయాల్లో తర్ఫీదు ఇచ్చాడు.
    ఇక ప్రస్తుతం నీరజ్ చోప్రా 2024 పారిస్ ఒలంపిక్స్ లక్ష్యంగా రాణిస్తున్నాడు. తనలో ఉన్న లోపాలపై సీరియస్ గా దృష్టి పెట్టి వాటిని అధిగమించేలా శిక్షణ పొందుతున్నాడు. ఇక టోక్యో ఒలంపిక్స్ ద్వారా రాత్రికి రాత్రే హీరో అయిపోయిన ఈ అథ్లెట్.. ఆ గెలుపు గాలివాటం కాదని నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఏ భారతీయుడికి సాధ్యం రికార్డులు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో టాప్ సెలబ్రిటీగా నిలిచాడు.