Team India : టి20 వరల్డ్ కప్ విజయాన్ని కంటే ముందు.. ఐసీసీ ఫైనల్స్ లో టీమిండియా ప్రస్థానం ఇదీ..

Team India 2024లో t20 వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగాయి. ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా - టీమిండియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించాడు.

Written By: NARESH, Updated On : July 1, 2024 9:45 am

Team India

Follow us on

Team India : టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆనందానికి అవధులు లేవు. ఆటగాళ్లు ఆ గెలుపునకు సంబంధించిన సంబరాలలో మునిగి తేలుతున్నారు. 2007 తర్వాత మళ్లీ ఇప్పుడే t20 వరల్డ్ కప్ నెగ్గడంతో యావత్ దేశం మొత్తం క్రికెటర్లకు జేజేలు పలుకుతోంది. ఇంతకీ ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీల ఫైనల్ మ్యాచ్ లలో టీమిండియా ప్రస్థానాన్ని ఒక్కసారి పరిశీలిస్తే..

1983లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండీస్ ను ఓడించి వన్డే వరల్డ్ కప్ దక్కించుకుంది. తొలిసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది.

2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. భారత్ – న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా ఓడిపోయింది.

2002 సంవత్సరంలో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా – శ్రీలంక ఫైనల్ దూసుకెళ్లాయి. సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా శ్రీలంకతో సంయుక్త విజేతగా నిలిచింది.

2003లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ – ఆస్ట్రేలియా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోయింది. అప్పుడు భారత జట్టుకు కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ఉన్నాడు.

2007లో టి20 వరల్డ్ కప్ జరిగింది.. తొలి ఎడిషన్లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించాడు.

2011లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. భారత్ – శ్రీలంక జట్లు తలపడ్డాయి. ధోని నాయకత్వంలోని భారత జట్టు రెండోసారి విశ్వ విజేతగా ఆవిర్భవించింది.

2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో భారత్ – ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచి ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకుంది. భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించాడు.

2014లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. శ్రీలంక – భారత్ ఫైనల్ మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించాడు.

2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో భారత్ – పాకిస్తాన్ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించి, ట్రోఫీని దక్కించుకుంది. భారత జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించాడు.

2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జరిగాయి. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా – న్యూజిలాండ్ పోటీపడ్డాయి. అయితే ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచి టెస్ట్ ఛాంపియన్ గదను దక్కించుకుంది. టీం ఇండియాకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు.

2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా – ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టీమిండియా కు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు.

2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా – ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆస్ట్రేలియా విజయం సాధించి, కప్ దక్కించుకుంది. టీమిండియా కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించాడు.

2024లో t20 వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగాయి. ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా – టీమిండియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించాడు.