T20 World Cup 2024 : ఓటమనేదే లేదు.. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సరికొత్త రికార్డు..

T20 World Cup 2024 : ఉగాండా కెప్టెన్ బియాన్ మాసబా తన జట్టుకు 45 టీ20 మ్యాచ్లలో విజయాలను అందించాడు. ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు 44 t20 మ్యాచ్లలో విజయాలు సాధించింది.

Written By: NARESH, Updated On : July 1, 2024 9:40 am

T20 World Cup 2024 is a new record for Team India without defeat

Follow us on

T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో అనేక రికార్డులను బద్దలు కొట్టిన టీమ్ ఇండియా.. సరికొత్త చరిత్రను తన పేరు మీద లిఖించుకుంది. టి20 వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ దక్కించుకుంది. ఇలా దక్కించుకున్న తొలి జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లను టీమిండియా ఓడించింది. సూపర్ -8 లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లను మట్టికరిపించింది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టును ఉతికి ఆరేసింది.. ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పై ఉత్కంఠ విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లలో(2007, 2024) రెండుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసి గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఇక మిగతా ఆరు సందర్భాలలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే విజేతలుగా నిలిచాయి.

ఇక టి20 లలో 12 నవంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు భారత్ జట్టు 12 మ్యాచ్లలో సుదీర్ఘ విజయాలు సాధించింది. డిసెంబర్ 2023 నుంచి జూన్ 2024 వరకు ఏకంగా 12 t20 మ్యాచ్లలో టీమిండియా విక్టరీలను అందుకుంది. జనవరి 20 నుంచి డిసెంబర్ 2020 వరకు ఏకంగా 9 t20 మ్యాచ్లలో వరుస విజయాలు సాధించింది. ఇక టి20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా 2024 ఎడిషన్ కు సంబంధించి ఎనిమిది విజయాలను వరుసగా సాధించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి కెనడా జట్టుతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాకుండా ఉంటే.. టీమిండియా ఖాతాలో మొత్తం తొమ్మిది విజయాలు ఉండేవి. ఇక ఇదే టోర్నీలో దక్షిణాఫ్రికా కూడా వరుసగా ఎనిమిది విజయాలు నమోదు చేసింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో భారత్ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. 2009 సీజన్లో శ్రీలంక వరుసగా 6 టి20 మ్యాచ్ లలో విజయాలు సాధించింది. 2010లో ఆస్ట్రేలియా వరుసగా 6 t20 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇక 2021 సీజన్లో ఆస్ట్రేలియా జట్టు 6 మ్యాచులను వరుసగా గెలుచుకుంది.

టి20 వరల్డ్ కప్ దక్కించుకోవడం ద్వారా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకొన్నాడు. ఏకంగా 50 t20 మ్యాచ్లలో టీమిండియా అని గెలిపించి.. అత్యధిక విజయాలు సొంతం చేసుకున్న కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. రోహిత్ తర్వాత స్థానంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో పాకిస్తాన్ 48 t20 మ్యాచ్లలో విజయం సాధించింది. ఉగాండా కెప్టెన్ బియాన్ మాసబా తన జట్టుకు 45 టీ20 మ్యాచ్లలో విజయాలను అందించాడు. ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు 44 t20 మ్యాచ్లలో విజయాలు సాధించింది.