https://oktelugu.com/

IPL 2024 : ప్లాట్ పిచ్ పై వికెట్ల వేట.. ఐపీఎల్ లో ఇప్పటికైతే వీరిదే రికార్డు..

అద్భుతమైన బంతులు వేసి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగల బౌలర్లలో పీయూష్ చాలా ఒకడు. ఇతడు ముంబై జట్టులో కీలక బౌలర్ గా ఉన్నాడు. ఇతడు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో 41 వికెట్లు పడగొట్టి, సరికొత్త చరిత్రను తన పేరు మీద సృష్టించుకున్నాడు.

Written By: NARESH, Updated On : May 6, 2024 8:43 am
This is the record of bowlers in IPL for wickets on flat pitch

This is the record of bowlers in IPL for wickets on flat pitch

Follow us on

IPL 2024 : ఐపీఎల్.. రిచ్ క్రికెట్ లీగ్. ఇప్పటివరకు 16 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ 16 సీజన్ల లోనూ బ్యాటర్లదే పూర్తిగా డామినేషన్. ఎప్పుడో ఒకసారి బౌలర్లు తమ మ్యాజిక్ ను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్ మా బౌలర్లను దేవుడే కాపాడాలి అని ట్వీట్ చేశాడంటే.. ఐపీఎల్ మ్యాచ్లు జరిగే మైదానాలు ఎలా ఉంటాయో.. వాటిని ఎలా రూపొందిస్తారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి మైదానాలపై కొంతమంది బౌలర్లకు తిరుగులేని రికార్డు ఉంది. అరి వీర భయంకరమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. వీరు తన బంతులతో బోల్తా కొట్టించారు. తమకు అచ్చి వచ్చిన మైదానాలపై అద్భుతంగా వికెట్లు తీసి, సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇంతకీ ఆ బౌలర్లు ఎవరంటే..

జస్ ప్రీత్ బుమ్రా, వాంఖడే

ఈ మైదానంలో జస్ ప్రీత్ బుమ్రాకు తిరుగులేని రికార్డు ఉంది. వాంఖడే మైదానం వేదికగా మే మూడున కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో జస్ ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ మైదానంపై 50 వికెట్లు సాధించిన బౌలర్ గా అవతరించాడు. ఈ మైదానంపై ఈ రికార్డు సాధించిన ఐదో బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు.

సునీల్ నరైన్, ఈడెన్ గార్డెన్స్

కోల్ కతా జట్టు లో కీలక బౌలర్ గా సునీల్ నరైన్ కొనసాగుతున్నాడు. అటు బ్యాట్, ఇటు బంతితో అదరగొట్టగలడు.. అటువంటి ఈ ఆల్ రౌండర్ కు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ కొట్టినపిండి. ఈ మైదానంపై ఇప్పటివరకు అతడు 69 వికెట్లు పడగొట్టాడు. మరే బౌలర్ కూడా ఇతడికి దరిదాపుల్లో లేరు.

మలింగ, వాంఖడే స్టేడియం ముంబై

ముంబై ఇండియన్స్ జట్టులో ఒకప్పుడు తిరుగులేని బౌలర్ గా మలింగ ఉండేవాడు. అద్భుతమైన బౌలింగ్ తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టేవాడు.. ఇతడికి వాంఖడే మైదానంలో అనితర సాధ్యమైన రికార్డు ఉంది. ఈ మైదానంపై మలింగ 68 వికెట్లు పడగొట్టాడు.

అమిత్ మిశ్రా, ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం

తనదైన ప్రత్యేకమైన బౌలింగ్ తో అమిత్ మిశ్రా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. తనదైన రోజు మ్యాచ్ స్వరూపాన్ని మార్చే యగలడు. ఢిల్లీ జట్టుకు ఆడుతున్న ఈ బౌలర్.. అరుణ్ జైట్లీ స్టేడియంలో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ మైదానంపై అతడు 58 వికెట్లు పడగొట్టాడు.

యజువేంద్ర చాహల్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం

యజువేంద్ర చాహల్ ప్రస్తుతం రాజస్థాన్ జట్టులో కీలక బౌలర్. అద్భుతంగా స్పిన్ బౌలింగ్ వేసే ఈ బౌలర్.. తనదైన మాయాజాలంతో వికెట్లు తీయగలడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 52 వికెట్లు పడగొట్టి.. సరికొత్త రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు.

హర్భజన్ సింగ్, వాంఖడే స్టేడియం, ముంబై

ముంబై జట్టుకు ఒకప్పుడు ఆడిన హర్భజన్ సింగ్.. వాంఖడే మైదానంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మైదానంలో 49 వికెట్లు పడగొట్టి.. అప్పట్లో రికార్డు సృష్టించాడు.

రవిచంద్రన్ అశ్విన్, చిదంబరం స్టేడియం

రాజస్థాన్ జట్టు కీలక బౌలర్లలో ఇతడు కూడా ఒకడు.. ఇతడికి చెన్నైలోని చిదంబరం స్టేడియం లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో 48 వికెట్లు పడగొట్టి సరికొత్త ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

భువనేశ్వర్ కుమార్, ఉప్పల్ స్టేడియం

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కీలకమైన బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ కు పేరు ఉంది. ఇతడికి హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సరికొత్త రికార్డు ఉంది.. ఈ మైదానంలో ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ 46 వికెట్లు పడగొట్టాడు.

బ్రావో, చిదంబరం స్టేడియం చెన్నై

బ్రావో.. ఒకప్పుడు చెన్నై జట్టుకు ఆడేవాడు. చెన్నై జట్టు సాధించిన విజయాలలో ఇతడిది కీలక పాత్ర. ఇతడు చిదంబరం స్టేడియంలో 44 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డును అప్పట్లో తన పేరు మీద లిఖించుకున్నాడు.

పీయూష్ చావ్లా, ఈడెన్ గార్డెన్స్ కోల్ కతా

అద్భుతమైన బంతులు వేసి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగల బౌలర్లలో పీయూష్ చాలా ఒకడు. ఇతడు ముంబై జట్టులో కీలక బౌలర్ గా ఉన్నాడు. ఇతడు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో 41 వికెట్లు పడగొట్టి, సరికొత్త చరిత్రను తన పేరు మీద సృష్టించుకున్నాడు.