T20 World Cup లో యూఎస్ఏ చేతిలో పాక్ ఓటమికి కారణం ఇదే?

ఈ మ్యాచ్ లో పాక్ జట్టు ఓటమికి ప్రధాన కారణం అమెరికా కొత్త జట్టు అని తక్కువగా అంచనా వేయడమే. ఈ మ్యాచ్ లో పాక్ ఆరంభం నుంచే వెనుకబడింది. వరుసగా వికెట్లు పడడం, బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా కుప్పకూలడం.

Written By: NARESH, Updated On : June 7, 2024 10:39 pm

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024 G అమెరికా, పాకిస్తాన్ మధ్య జరిగిన T20 ప్రపంచకప్ మ్యాచ్ లో బాబర్ ఆజమ్ అండ్ టీమ్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. సూపర్ ఓవర్ తో అమెరికా పాక్ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

డల్లాస్ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం (డల్లాస్) వేదికగా జూన్ 6 (గురువారం) ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అమెరికా కొత్త జట్టు కావడంతో పాక్ మరింత లైట్ తీసుకుంది. దీంతో ఓటమి చూడాల్సి వచ్చింది. సెకండ్ బ్యాటింగ్ కు దిగిన అమెరికా స్కోర్ ట్యాలీ చేసినప్పుడే పాక్ అలెర్ట్ అయితే బాగుండేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా-పాక్ మ్యాచ్ లో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, అమెరికా కూడా అద్భుత ప్రదర్శనతో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి మ్యాచ్ ను సమం చేసింది. ఆ తర్వాత మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. అక్కడ యూఎస్ఏ ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 13 పరుగుల వద్దే ఆగిపోయింది. దీనికి గల కారణాలు విశ్లేషకులు ఈ విధంగా అంచనా వేస్తు్న్నారు.

* అమెరికాను తక్కువ అంచనా వేయడం
ఈ మ్యాచ్ లో పాక్ జట్టు ఓటమికి ప్రధాన కారణం అమెరికా కొత్త జట్టు అని తక్కువగా అంచనా వేయడమే. ఈ మ్యాచ్ లో పాక్ ఆరంభం నుంచే వెనుకబడింది. వరుసగా వికెట్లు పడడం, బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా కుప్పకూలడం.

* మహ్మద్ అమీర్ కు బాధ్యతలు..
నసీమ్ షా, జస్ప్రీత్ బుమ్రాలకు సూపర్ ఓవర్ ఇస్తారా అని బాబర్ అజామ్ ను ప్రశ్నించగా.. నసీమ్ షాకు ఇస్తానని చెప్పాడు. నిన్న (జూన్ 6) సూపర్ ఓవర్ ఇవ్వాల్సిన టర్న్ వచ్చినప్పుడు నసీమ్ షా ఉన్నప్పటికీ మహ్మద్ ఆమీర్ ఇచ్చాడు. అమీర్ సూపర్ ఓవర్ లో  వైడ్లు ఎక్కువ వేసి 18 పరుగులు ఇచ్చాడు.

* టాప్ ఆర్డర్ ఫ్లాప్
టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ను ఎంచుకుంది. పాక్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ రిజ్వాన్ (9), ఉస్మాన్ ఖాన్ (3), ఫకార్ జమాన్ (11) పరుగులు చేశారు. బాబర్, షాదాబ్లే గౌరవాన్ని కాపాడారు. పాక్ బౌలర్లలో బాబర్ అజామ్ (44), షాదాబ్ ఖాన్ (40) రాణించారు. చివరలో షాహీన్ షా అఫ్రిది (23 నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్ (18) కూడా చేతులెత్తేయడంతో పాక్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

* వికెట్లు తీయడంలో విఫలం
బ్యాటింగ్ లో ఫాం కోల్పోయిన జట్టు.. బౌలింగ్ లో కూడా కంటిన్యూ చేసింది. పాక్ జట్టు అమెరికా వికెట్లు తీయలేకపోయింది. 12 పరుగుల వద్ద స్టీవెన్ టేలర్ ను ఔట్ చేసింది. పాక్ జట్టు అమెరికాను చిత్తు చేస్తుందని భావించినా మొదటి వికెట్ తర్వాత పాక్ జట్టు 104 పరుగుల వద్ద ఆండ్రియాస్ గాస్ (35) ను పెవిలియన్ కు పంపారు. 111 పరుగుల వద్ద మూడో వికట్ తీసింది. ఆ తర్వాత పాక్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.

చివరి ఓవర్ లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. అక్కడ నితీశ్ బంతిని బౌండరీకితరలించి మ్యాచ్ ను సూపర్ ఓవర్ వైపునకు తీసుకెళ్లాడు. ఆరోన్ జోన్స్ (36), నితీశ్ కుమార్ (14) అజేయంగా నిలిచారు.

* సూపర్ ఓవర్
రెండు జట్ల స్కోర్ సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇఫ్తికార్ అహ్మద్, ఫకార్ జమాన్ సూపర్ ఓవర్లో ఓపెనింగ్ చేశారు. కానీ పాకిస్తాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ రూపంలో ఇద్దరు ఫాస్ట్ బ్యాట్స్ మన్ ఉన్నారు. అయినా ఫఖర్, ఇఫ్తికార్ ను ఓపెనింగ్ కు ఎందుకు పంపానేది అతిపెద్ద ప్రశ్న. ఇందులో ఇఫ్తికార్ ఓవర్ ఆడలేక ఔటయ్యాడు.

అంతకు ముందు సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టుకు పాకిస్తాన్ కు చెందిన మహ్మద్ ఆమిర్ బౌలింగ్ వేశాడు. ఆరోన్ జోన్స్, హర్మీత్ సింగ్ అమెరికా నుంచి ఓపెనింగ్ కు వచ్చారు. మరోవైపు అమెరికా తరఫున సౌరభ్ నేత్రవాల్ కర్ సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసి జట్టుకు విజయం సాధించి పెట్టాడు.