MS Dhoni : ధోని చివర్లో రావడం వెనుక అసలు నిజం ఇదీ..

చెన్నై జట్టు నుంచి కాన్వే నిష్క్రమించిన అనంతరం ధోనికి మరో అవకాశం లేకుండా పోయింది. అందువల్లే ధోని వికెట్ కీపింగ్ తోపాటు బ్యాటింగ్ చేస్తున్నాడు. తనకు అంత ఇబ్బంది ఉన్నప్పటికీ.. ఏమాత్రం బయటకు కనిపించనీయకుండా ధోని ఆడుతున్నాడు.. ఇప్పుడు అసలు విషయం తెలియడంతో అభిమానులు ధోనిపై ప్రేమ కురిపిస్తున్నారు. క్రికెట్ లెజెండ్ అని కొనియాడుతున్నారు.

Written By: NARESH, Updated On : May 7, 2024 10:24 pm

This is the real truth behind MS Dhoni's arrival at the end.

Follow us on

MS Dhoni : చివర్లో వస్తున్నాడు.. వచ్చిన బంతుల్ని ఫోర్లు లేదా సిక్స్ లుగా మలుస్తున్నాడు. అలాంటివాడు మొదట్లోనే బ్యాటింగ్ చేయవచ్చు కదా. ఐపీఎల్ ప్రారంభమైన నటించి ధోని బ్యాటింగ్ మీద వస్తున్న విమర్శలు ఇవీ. ఇక సోషల్ మీడియాలో తను వస్తున్న బ్యాటింగ్ స్థానానికి సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ధోని ఇంతవరకు నోరు మెదపలేదు. అఫ్కోర్స్ తన ఆట తీరు పట్ల ఇంతవరకు అతడు పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. అయితే ధోని ఆ స్థానంలో బ్యాటింగ్ కు ఎందుకు వస్తున్నాడు అనే ప్రశ్నకు ఇన్ని రోజులకు సమాధానం లభించింది.

వాస్తవానికి ధోని ప్రస్తుత ఐపీఎల్ లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆడుతున్నాడు. వికెట్ల మధ్యలో తీసే పరుగుకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేందుకు అతడు మందులు వాడుతున్నాడు. వాస్తవానికి వైద్య నిపుణులు ధోనిని క్రికెట్ ఆడకూడదని సూచించారు. కానీ అతడికి ప్రత్యామ్నయం లేదు. ఇప్పటికే చెన్నై జట్టులో కీలకమైన ఆటగాళ్లు మొత్తం గాయపడ్డారు. ఫలితంగా బీ టీం తో ఆడుతున్నారు. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో ఆడుతున్నప్పటికీ చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది అంటే మామూలు విషయం కాదు. ఇక ధోని బ్యాటింగ్ కు దిగే స్థానం పట్ల ఇప్పటివరకు చాలామంది రకరకాలుగా మాట్లాడారు. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత ధోని వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. మైదానం ప్లాట్ గా ఉండటంతో చెన్నై వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఆ జట్టు 122 రన్స్ వద్ద ఆరో వికెట్ నష్టపోయింది. ఈ దశలో చాలామంది ధోని బ్యాటింగ్ చేసేందుకు వస్తాడని భావించారు. కానీ అలా జరగలేదు. ధోని స్థానంలో శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు పెద్దగా అద్భుతాలు చేయలేకపోయాడు. శార్దూల్ అవుట్ కావడంతో 9వ స్థానంలో ధోని బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. అలా ధోని వస్తున్న తీరు పట్ల చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఖాతా తెరవకుండానే ధోని తొలి బంతికి అవుట్ అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో, బంతిని అంచనా వేయలేక ధోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ధోని ఆ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అవుట్ కావడం పట్ల సీనియర్ క్రికెటర్లు స్పందించారు. వాస్తవానికి వారికి అసలు విషయం తెలియదు. అందువల్ల ఏవేవో మాట్లాడారు. హర్భజన్ సింగ్ లాంటి ఆటగాడు సైతం ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం పట్ల విమర్శలు చేశాడు. ఆ నెంబర్లో ధోని లాంటి ఆటగాడు బ్యాటింగ్ కు రావడం ఏంటని ప్రశ్నించాడు. ధోని కి ఆడటం ఇష్టం లేకపోతే జట్టు నుంచి వైదొలగాలని.. వేరే ఆటగాడికి అవకాశం ఇవ్వాలని కోరాడు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం 42 సంవత్సరాల వయసు ఉన్న ధోని కి కండరాలు పట్టేశాయి. అందుకే అతను వేగంగా పరిగెత్త లేకపోతున్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో ధోని అలాంటి అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ధోని చివరి స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు.. చెన్నై జట్టు నుంచి కాన్వే నిష్క్రమించిన అనంతరం ధోనికి మరో అవకాశం లేకుండా పోయింది. అందువల్లే ధోని వికెట్ కీపింగ్ తోపాటు బ్యాటింగ్ చేస్తున్నాడు. తనకు అంత ఇబ్బంది ఉన్నప్పటికీ.. ఏమాత్రం బయటకు కనిపించనీయకుండా ధోని ఆడుతున్నాడు.. ఇప్పుడు అసలు విషయం తెలియడంతో అభిమానులు ధోనిపై ప్రేమ కురిపిస్తున్నారు. క్రికెట్ లెజెండ్ అని కొనియాడుతున్నారు.