IND vs PAK Match Pitch Report
IND vs PAK: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో ఈ రోజు భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. దుబాయ్ (Dubai)లో జరిగే ఈ కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్లో భారత జట్టు తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును 6 వికెట్లతో ఓడించింది. పాకిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్‌లో న్యూజీలాండ్‌తో 60 రన్ ల తేడాతో ఓడిపోయింది. దీంతో నేటి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకు విజయం చాలా అవసరం. లేకపోతే జట్టు ఈ టోర్నమెంట్ నుంచి ఇంటి బాట పట్టాల్సిందే. ఈ రోజు మ్యాచ్ మధ్యాహ్నం 2:30గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్ల మధ్య టాస్ 2గంటలకు వేస్తారు. భారత జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ , పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్ వ్యవహరిస్తున్నారు.
భారత్, పాకిస్థాన్ మధ్య ఇప్పటివరకు 135 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లలో పాకిస్థాన్ 73 మ్యాచ్‌లలో గెలిచింది. భారత్ 57 మ్యాచుల్లో విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. పాకిస్థాన్-భారత జట్లు దుబాయ్ (Dubai) వేదికగా 77 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో పాకిస్థాన్ 40 మ్యాచ్ లలో గెలిచింది. భారత్ 34 మ్యాచుల్లో విజయం సాధించింది.
పిచ్ రిపోర్ట్:
ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (Dubai International Cricket Stadium) జరుగుతుంది. ఈ వేదికపై సాధారణంగా బ్యాట్స్ మెన్ లకు అనుకూలంగా ఉంటుంది. అధిక పరుగుల సాధనకు అనుకూలంగా ఉంటుంది. మొదటి బ్యాటింగ్ చేసే జట్టు మంచి స్కోర్ నమోదు చేసేందుకు పిచ్ అనుకూలంగా ఉంటుంది.
ఈ రోజు దుబాయ్‌లో మధ్యాహ్నం 2:30గంటలకు నుంచి మ్యాచ్ జరుగుతుంది. ఆ సమయంలో దుబాయ్ వాతావరణం మేఘాలతో కూడిన ఉంటుంది. వర్షం పడే అవకాశాలు తక్కువ. ఉష్ణోగ్రత 27డిగ్రీల సెంటిగ్రేడ్ గా ఉండనుంది. గరిష్టంగా ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి ప్లేయర్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. పాకిస్థాన్ జట్టులో బాబర్ ఆజమ్, మొహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిది వంటి క్రీడాకారులపై అభిమానులు దృష్టి పెట్టారు.
టీమ్ లైనప్:
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, మోహమ్మద్ శమీ, అర్షదీప్ సింగ్.
పాకిస్థాన్ జట్టు: మొహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అగా (వైస్ కెప్టెన్), కమరన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, మోహమ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, ఖుష్దిల్ షా, ఉస్మాన్ ఖాన్.