Champions Trophy 2025
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రస్తుతం జోరుగా సాగుతుంది. నేడు టోర్నమెంట్లో ఐదో మ్యాచ్ దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ మ్యాచ్ భారత్ పాక్ రెండు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్ లో భారత్ పాక్ ను ఓడించి సెమీ ఫైనల్ చేరుకోవాలని చూస్తుంది. అదే విధంగా పాక్ భారత్ ను ఓడించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే పరిస్థితిని అడ్డుకోవాలని చూస్తుంది. ఒక వేళ పాక్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తుంది.దీంతో భారత్ పాక్ రెండింటికీ ఈ మ్యాచ్ చాలా కీలకం. భారత క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ మ్యాచ్ లో విజయం సాధించాలని క్రికెట్ అభిమానులు దేశంలోని అనేక ప్రాంతాల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
కీలక మ్యాచ్ లకు ముందు టీం ఇండియా అభిమానులు విజయం కోసం ప్రార్థించడం కామన్. ఇప్పుడు భారత్ తన దాయాది దేశం అయిన పాకిస్తాన్ తో తలపడనుంది. దీనికి ముందు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అభిమానులు ప్రత్యేకంగా యజ్ఞం, పూజలు నిర్వహించారు. దాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భారత జట్టుకు అన్ని ఏజ్ ల వారిలో మంచి ఫాలోయింగ్ ఉంది. పిల్లలు కూడా టీం ఇండియా విజయం కోసం ప్రార్థిస్తున్నారు. ANI తన X హ్యాండిల్‌లో పూజలు నిర్వహిస్తున్న అభిమానులకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది.
ఇప్పటివరకు టీం ఇండియా రికార్డు
ఐసిసి వన్డే టోర్నమెంట్లలో పాకిస్థాన్‌పై భారత్ ఇప్పటివరకు భారత్ మంచి రికార్డును కలిగి ఉంది. ఈ టోర్నమెంట్లలో టీమిండియా ఇప్పటివరకు పాకిస్థాన్‌తో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడింది. ఈ కాలంలో టీం ఇండియా 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీం ఇండియా మంచి ప్రదర్శన ఇచ్చింది. నేడు అందరి దృష్టి టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఉంది. ఈ మధ్య కాలంలో కోహ్లీ ఫామ్ సరిగ్గా లేదు. కానీ గతంలో పాకిస్తాన్ పై తను మంచి ప్రదర్శన ఇచ్చారు. దీంతో నేడు జరిగే మ్యాచ్ లో కోహ్లీ పాక్ మీద పరుగుల వర్షం కురిపిస్తాడని అభిమానులు ఆశిస్తారు. మరోవైపు, పాకిస్తాన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది.
#WATCH | Uttar Pradesh: Cricket fans in Varanasi perform havan for Team India’s victory as they face Pakistan today in the #ICCChampionsTrophy.#INDvsPAK pic.twitter.com/Of1XdM7b7A
— ANI (@ANI) February 23, 2025