IND Vs PAK (1)
IND Vs PAK: నేడు క్రికెట్ అభిమానులకు పండుగే.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హై వోల్టేజీ మ్యాచ్ నేడు దుబాయ్ లో జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజ్ మ్యాచ్ భారత్ పాక్ ల మధ్య జరుగుతుంది. ఐసిసి వన్డే టోర్నమెంట్ల రికార్డులను పరిశీలిస్తే.. పాక్ కంటే భారత్ ఇప్పటి వరకు పై చేయి సాధించింది. అందరి కళ్ళు ప్రస్తుతం విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ పైనే ఉన్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు గత ఇన్నింగ్స్‌లలో క్రికెట్ అభిమానులు చెప్పుకునే విధంగా ప్రత్యేకంగా ఏం చేయలేకపోయారు. దుబాయ్ వాతావరణం నేడు మ్యాచ్ కు అనుకూలంగా ఉంది.
ఈ టోర్నమెంట్‌ను బంగ్లాదేశ్ ను ఓడించి భారత్ విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో నేడు భారత్ తో జరిగే మ్యాచ్ పాకిస్తాన్ కు డు ఆర్ డై మ్యాచ్. భారత్ పాకిస్థాన్‌ను ఓడిస్తే సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. అదే సమయంలో పాక్ ఇంటి బాట పట్టాల్సిందే. టీం ఇండియా ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ ఈ మ్యచ్ లో రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పాకిస్తాన్‌తో జరిగిన వన్డేల్లో విరాట్‌కు ఇప్పటివరకు మంచి రికార్డు ఉంది. తను 16 ఇన్నింగ్స్‌లలో 678 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువగా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన వన్డేల్లో కోహ్లీ మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. ఈ సమయంలో తను బెస్ట్ స్కోర్ 183పరుగులు.
తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను న్యూజిలాండ్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ 64 పరుగులు చేశారు. ఖుస్దిల్ షా 69 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ సమయంలో కూడా అందరి కళ్లు బాబర్ మీదే ఉన్నాయి. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ కు గత కొన్ని మ్యాచ్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. కానీ అతను న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు తను భారత్‌పై జరిగే మ్యాచ్ లో రాణించాలని చూస్తున్నాడు.
ఇండియా-పాకిస్తాన్ హెడ్ టు హెడ్ రికార్డు
భారత్ ఇప్పటివరకు పాకిస్థాన్‌తో 135 వన్డే మ్యాచ్‌లు ఆడింది. టీం ఇండియా 57 మ్యాచ్‌ల్లో గెలిచింది. పాకిస్తాన్ 73 మ్యాచ్‌ల్లో గెలిచింది. దీంతో పాకిస్తాన్ పైచేయి సాధించినట్లు అనిపిస్తుంది. కానీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే టీం ఇండియా దుబాయ్‌లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
దుబాయ్‌లో వాతావరణం ఎలా ఉంటుంది?
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. ఆదివారం దుబాయ్‌లో సగటు ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చు. ఆటగాళ్లతో పాటు అభిమానులకు పండుగ వాతావరణం నెలకొననుంది.
భారత్ ఎలెవన్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా.
పాకిస్తాన్ ఎలెవన్
ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్